అల్లంతో 11 ఆరోగ్య ప్రయోజనాలివే
Ginger has 11 health benefits: ఆహారంలో రుచిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్య పరంగానూ అల్లం మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో అనేక పోషక విలువలతో పాటు విటమిన్ సి, ఇ, మాంగనీస్, ఐరన్, మెగ్నీషియం వంటివి ఉన్నాయి. అల్లం తినడం వలన అనేక అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.1.ఎముక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
అల్లం ఎముక ఆరోగ్యాన్ని పెంచుతుంది. కీళ్ళ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కీళ్ళనొప్పులు, ఆర్థ్రోసిస్, ఫైబ్రోమైయాల్జియా, లేదా క్రానిక్ ఫెటీగ్ వంటి సహజ వాపు లేదా బాధాకరమైన వ్యాధుల చికిత్సకు అల్లం సిఫార్సు చేయబడింది.
2.జలుబు, దగ్గుకి అల్లంతో చెక్ :
ఒక టేబుల్ స్పూన్ తేనెలో కొన్ని అల్లం రసం చుక్కల్ని వేసి ఓ మిశ్రమంగా కలిపి తీసుకుంటే, జలుబు, దగ్గు హుష్ కాకి అవుతాయి. రోజుకు రెండు నుంచి నాలుగుసార్లు ఇలా చేయాలి.
3.క్యాన్సర్ తో పోరాడుతుంది:
ఈ రూట్ వెజిటేబుల్లో క్యాన్సర్ తో పోరాడే గుణాలు మెండుగా ఉన్నాయి. కీమో థెరఫీ డ్రగ్స్ కంటే సురక్షితమైనది. కోలన్, ప్రేగుల్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కోలన్ క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది. కాబట్టి, క్యాన్సర్ ట్రీట్మెంట్స్ లో అల్లంను ఎక్కువగా చేర్చుతుంటారు.
4.ఆర్థ్రైటిస్ పెయిన్, ఇన్ఫ్లమెషన్ ను తగ్గిస్తుంది :
అల్లంను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల సెల్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అల్లంలో ఉండే జింజరోల్ అనే కంటెంట్, ఆర్థ్రైటిస్ కు సంబంధించిన నొప్పి, వాపులను తగ్గిస్తుంది. . అల్లంతో ఇది ఒక ముఖ్యమైన ప్రయోజనం.
5.గ్యాస్టో ఇండెక్స్ ట్రాక్ నుండి అసిడిక్ రిఫ్లెక్షన్ తగ్గిస్తుంది:
స్టడీస్ ప్రకారం, అసిడిక్ బ్లాకింగ్ డ్రగ్స్ కంటే 6 రెట్లు అల్లం మంచిదని కనుగొన్నారు. ఈ డ్రగ్స్ బెల్లీని డ్యామేజ్ చేసి, అల్సర్, స్టొమక్ క్యాన్సర్ కు దారితీస్తాయి. అందువల్ల అసిడిక్ రిఫ్లెక్షన్ తగ్గించుకోవడానికి అల్లంను ఎఫెక్టివ్ గా ఉపయోగించుకోవచ్చు.
6.మార్నింగ్ సిక్ నెస్ తగ్గిస్తుంది:
అల్లంలో వికారం, వాంతులు తగ్గించే గుణాలు అధికం. ముఖ్యంగా గర్భిణీలు ఈ లక్షణాలను నివారించుకోవడానికి అల్లంను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది. మార్నింగ్ సిక్ నెస్ తగ్గించడంలో ఇది ఒక ఎక్సలెంట్ హోం రెమెడీ..
7.గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది :
గొంతు నొప్పితో ఇబ్బంది పడుతుంటే, అల్లం ముక్క తీసుకుని, అందులో నీళ్ళలో వేసి బాగా మరిగించాలి. తర్వాత దీనికి కొద్దిగా తేనె , నిమ్మరసం మిక్స్ చేసి తీసుకోవాలి. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల ముక్కు దిబ్బడ నుండి ఉపశమనం కలుగుతుంది.
8.జీర్ణ సమస్యలను నివారిస్తుంది:
పొట్ట ఉబ్బరం, పొట్ట నొప్పి సమస్యలున్నప్పుడు చిన్న అల్లం ముక్క నోట్లో వేసుకుని నమలవచ్చు. లేదా నీళ్ళలో వేసి ఉడికించిన జింజర్ టీ రూపంలో తీసుకోవచ్చు. లేదా జింజర్ టీకి కొద్దిగా తేనె మిక్స్ చేసి రోజూ తీసుకోవడం వల్ల బెల్లీ అప్ సెట్ నుండి ఉపశమనం కలుగుతుంది.
9.తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది:
తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలుంటే కేయాన్ పెప్పర్, డ్రై మింట్, చిన్న అల్లం ముక్క మిక్స్ చేసి, దీనికి కొద్దిగా తేనె చేర్చి రోజూ కనుక తిన్నట్లైతే తలనొప్పి నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది.
10.దంతాల నొప్పి:
దంత సమస్యలతో బాధపడే వారు, చిగుళ్ళ సమస్యలున్న వారు కొద్దిగా అల్లం ముక్క తీసుకుని నొప్పి ఉన్న ప్రదేశంలో పెట్టి నమిలాలి. అల్లంలో ఉండే బయోయాక్టివ్ మోలాక్యులస్ చిగుళ్ళు నొప్పులు, ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.
11.రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది :
50 గ్రాముల అల్లంను మెత్తగా పేస్ట్ చేసి అందు నుండి జ్యూస్ తీసి , అందులో 5 లీటర్ల వాటర్ మిక్స్ చేయాలి. ఈ నీటిని శరీరానికి అప్లై చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
COMMENTS