Bring this oil. Many uses for skin in winter!
Winter Skin Care: ఈ నూనె తెచ్చిపెట్టుకోండి.. చలికాలంలో చర్మానికి చాలా ఉపయోగాలు! ఎలా వాడాలంటే..
Winter Skin Care: చలికాలంలో చర్మ సమస్యలు ఎక్కువగా ఎదురవుతుంటాయి. ముఖ్యంగా చర్మం పొడిబారుతుంది. మరిన్ని ఇబ్బందులు ఉంటాయి. అయితే, చర్మ సమస్యలు తగ్గేందుకు ఓ నూనె ఎక్కువగా ఉపయోగపడుతుంది.
చలికాలం అతిత్వరలో వచ్చేస్తోంది. ఇప్పటికే కాస్త చలి మొదలైంది. ఈ కాలంలో వాతావరణం చల్లగా మారిపోతుంది. దీనివల్ల చర్మ సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. చర్మం పొడిబారడమే కాకుండా మరిన్ని ఇబ్బందులు వస్తాయి. అయితే, ఈ కాలంలో బాదం నూనె (ఆల్మండ్ నూనె) చాలా ఉపయోగపడుతుంది. అందుకే చలికాలం రాకముందే ఈ నూనెను తెచ్చిపెట్టుకోంది. చర్మానికి బాదం నూనె ఏ ప్రయోజనాలు కల్పిస్తోందో ఇక్కడ తెలుసుకోండి.
చర్మం పొడిబారకుండా.. మెరుపు ఉండేలా:
బాదం నూనె చర్మానికి తేమను అందజేస్తుంది. చలికాలంలో చర్మాన్ని పొడిబారకుండా చేయగలదు. నిద్రపోయే ముందు చర్మానికి బాదం నూనె రాసుకోండి. ఈ నూనెలో ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. దీంతో తేమను లాక్ చేసి ఉంచుతుంది. చర్మం పొడిబారదు. చర్మం మెరుపుతో ఉంటుంది. రెండు చేతుల్లో బాదం నూనె వేసుకొని కాస్త రుద్ది ముఖానికి పూసుకోవాలి.
కళ్ల కింద వలయాలకు..
కళ్ల కింద నల్లటి వలయాల్లా ఉండే డార్క్ సర్కిల్స్ సమస్యను ఆల్మండ్ ఆయిల్ తగ్గించదలదు. మీరు నిద్రించే ముందు ప్రతీ రోజు కళ్లు కింద ఈ నూనెను రాసుకోండి. రెండు వారాల్లోనే ఫలితం కనిపించే అవకాశం ఉంటుంది.
ట్యాన్ తగ్గేందుకు ఇలా..
చర్మంపై కమిలినట్టుగా నల్లగా ఏర్పడే ట్యాన్ తగ్గేందుకు కూడా బాదం నూనె ఉపయోగపడుతుంది. సమాన మోతాదులో కొన్ని చుక్కల బాదం నూనె, నిమ్మ రసం, కాస్త తేనెను కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ట్యాన్ ఏర్పడిన చోట పూయాలి. కొన్ని రోజుల్లోనే దీని సానుకూల ప్రభావాన్ని చూడొచ్చు.
మడమ పగుళ్లకు కూడా..
మడమ పగుళ్లకు కూడా బాదం నూనె వాడొచ్చు. పగిలిన మడమలకు ఈ నూనె రాత్రి వేళ రాయాలి. రాత్రంగా అలాగే వదిలేయాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే ఏవైనా ఇన్ఫెక్షన్ ఉంటే తొలగిపోతుంది. స్కిన్ రాషెష్‍కు కూడా ఈ నూనె ఉపయోగించవచ్చు. బాదం నూనెతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
స్ట్రెచ్‍మార్క్స్ తగ్గేందుకు..
బాదం నూనెలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. అందుకే ఈ నూనె స్ట్రెచ్‍మార్క్స్ తగ్గించగలదు. స్ట్రెచ్‍మార్క్స్ ఏర్పడిన చోట కాస్త బాదం నూనె వేసి మసాజ్ చేయాలి. స్నానం చేసిన వెంటనే ఇలా చేయాలి.
పెదాలకు..
చలికాలంలో పెదాలు పగలడం కూడా సమస్యగా ఉంటుంది. దీనికి కూడా బాదం నూనె ఉపయోగపడుతుంది. పెదాలకు ఈ నూనె రాసుకోవాలి. పెదాలు నల్లగా కాకుండా కూడా ఈ నూనె చేయగలదు. మచ్చలను కూడా తగ్గించగలదు.
COMMENTS