APSRTC Job Recruitment : Apply for direct job immediately based on merit without written exams
APSRTC Job Recruitment : రాత పరీక్షలు లేకుండా మెరిట్ ఆధారంగా డైరెక్ట్ ఉద్యోగం వెంటనే అప్లై చేయండి.
APSRTC Job Vacancy : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం, మొత్తం 606 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా, అభ్యర్థుల అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కర్నూలు మరియు విజయవాడ జోన్ల పరిధిలోని జిల్లాల్లో ఖాళీలు భర్తీ చేయబడతాయి.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఎటువంటి రాత పరీక్షలు లేకుండా, ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబర్ 6, 2024 నుండి నవంబర్ 20, 2024 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో భాగంగా, ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది.
సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC).
పోస్ట్ పేరు : అప్రెంటిస్ (Apprentice).
భర్తీ చేస్తున్న పోస్టులు ఆయా ట్రేడుల వివరాలు:
- డీజిల్ మెకానిక్.
- మోటార్ మెకానిక్.
- ఎలక్ట్రీషియన్.
- వెల్డర్.
- పెయింటర్.
- ఫిట్టర్.
- మెషినిస్ట్.
- డ్రాఫ్ట్స్‌మెన్ (సివిల్).
అర్హతలు:
సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్. అకడమిక్ మెరిట్, సీనియారిటీ ప్రకారం.
నెల జీతం:
అప్రెంటిస్‌లు నియమితమైన తర్వాత సంబంధిత జోన్ మరియు ట్రేడ్ ప్రకారం శిక్షణ కాలంలో స్టైపెండ్ అందించబడుతుంది.
వయోపరిమితి:
కనిష్ట వయస్సు : 18 సంవత్సరాలు to గరిష్ట వయస్సు : 24 సంవత్సరాలు.
దరఖాస్తు విధానం:
APSRTC అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి దరఖాస్తు ఫారమ్ భర్తీ చేయాలి.
అవసరమైన ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలి.
దరఖాస్తు ఫీజు చెల్లింపు చేసి, ఫారమ్ సమర్పించాలి.
దరఖాస్తు రుసుము:
ధ్రువపత్రాల పరిశీలన కోసం రూ.118 చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ:
ఎంపిక విధానం పూర్తిగా అకడమిక్ మెరిట్ ఆధారంగా ఉంటుంది. అభ్యర్థుల ఐటీఐలో పొందిన మార్కులు, సీనియారిటీ ప్రాముఖ్యాన్ని ఇస్తారు. రిజర్వేషన్ల నియమాలను పాటించనున్నారు.
ముఖ్యమైన తేదీ వివరాలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: నవంబర్ 6, 2024.
దరఖాస్తు చివరి తేదీ: నవంబర్ 20, 2024.
తరచూ అడిగే ప్రశ్నలు మరియు సమాధానం
ఈ పోస్టులకు రాత పరీక్ష ఉందా?
లేదు, ఎంపిక పూర్తిగా అకడమిక్ మార్కుల ఆధారంగా జరుగుతుంది.
దరఖాస్తు ఫీజు ఎంత?
ధ్రువపత్రాల పరిశీలన కోసం రూ.118 చెల్లించాలి.
ఎవరెవరికి అర్హత ఉంది?
సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు.
ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
ఐటీఐలో పొందిన మార్కులు, సీనియారిటీ ప్రకారం ఎంపిక జరుగుతుంది.
ఎక్కడ ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది?
విజయవాడ జోన్: చెరువు సెంటర్, విద్యాధరపురం, విజయవాడ.
కర్నూలు జోన్: బళ్లారి చౌరస్తా, కర్నూలు.
Important Links:
1st Notification Pdf Click Here
2nd Notification Pdf Click Here
Official Website Click Here
COMMENTS