If it is like this on the tongue, it is like getting cancer. It's hard not to recognize it beforehand
నాలుకపై ఇలా ఉంటే క్యాన్సర్ వచ్చినట్లే.. ముందుగా గుర్తించకపోతే కష్టమే.
మనకి వచ్చే అతి పెద్ద ఆరోగ్య సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. ఏ క్యాన్సర్‌ని అయినా ఆ లక్షణాలని ముందుగా గుర్తించి ట్రీట్‌మెంట్ తీసుకున్నప్పుడే తగ్గించుకోగలం. కాబట్టి, టంగ్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకోండి.
కొన్నిసార్లు క్యాన్సర్ వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపించవు. అయితే, మరికొన్ని క్యాన్సర్స్ మాత్రం లక్షణాలని చూపిస్తాయి. వాటిని మనం ముందుగానే గుర్తించాలి. లేదంటే సమస్య తీవ్రత పెరిగి ట్రీట్‌మెంట్ చేసినా ఉపయోగం ఉండదు. ఇక టంగ్ క్యాన్సర్ సమస్య వస్తున్నప్పుడు నోటిపై కొన్ని కణాలు పెరుగుతాయి. ఇవి అక్కడితో ఆగకుండా నోటిలో అనేక భాగాలకు వ్యాపిస్తాయి. ఈ క్యాన్సర్ అనేది గొంతులో కూడా రావొచ్చు. నాలుకపై ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మీరు ఏం తినలేరు. తాగలేరు. మాట్లాడడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. లక్షణాలను గమనించిన వెంటనే డాక్టర్‌ని కలవడం చాలా మంచిది. దీని వల్ల ఎర్లీ స్టేజ్‌లోనే క్యాన్సర్‌ని తరిమి కొట్టొచ్చు.
క్యాన్సర్స్ రకాలు..
నోటి క్యాన్సర్ : దీనిని కాస్తా ఈజీగానే గుర్తుపట్టొచ్చు. నాలుకపై సమస్యగా ఉంటుంది. పుండు, వాపు వస్తుంది. వీటిని గమనించగానే డాక్టర్‌ని కలవాలి. గొంతులో క్యాన్సర్ : ఈ క్యాన్సర్‌ని ఓరోఫారింజియల్ టంగ్ క్యాన్సర్ అంటారు. ఈ సమస్యలో అంత త్వరగా లక్షణాలు కనిపించవు. కొంతవరకూ క్యాన్సర్ వచ్చాక నాలుక వెనుక భాగంలో పెరిగినప్పుడు గుర్తించలేం.
ఓరోఫారింజియల్ క్యాన్సర్‌కి ట్రీట్‌మెంట్..
ఓరోఫారింజియల్ క్యాన్సర్‌కి రొబోటిక్ సర్జరీ ఎలా చేస్తారు..
ప్యాచెస్..
మనకి అప్పుడప్పుడు నాలుకపై తెలుపు, ఎరుపు రంగుల్లో ప్యాచెస్ ఏర్పడతాయి. ఇవి అంత త్వరగా పోవు. కనీసం 3 వారాలైనా ఉంటాయి. దీంతో చాలా ఇబ్బందిగా ఉంటుంది. నొప్పి, మంటగా ఉంటుంది. ఇది కొన్నిసార్లు నాలుక, నోరు, దవడ, మెడ, చెవిలో కూడా నొప్పిగా ఉంటుంది. నాలుక, దవడ నమిలినా, కదిలినా నొప్పి ఎక్కువగా ఉంటుంది. అంత త్వరగా తగ్గదు. నాలుక తిమ్మిరిగా కూడా ఉంటుంది.
పుండ్లు..
నాలుకపై ఎరుపు, బూడిద రంగులో పుండు లేదా వాపు ఉండి నొప్పి ఎక్కువగా ఉంటుంది. మనం బ్రష్ చేసినా నోటి నుంచి అదో రకమైన వాసన వస్తుంటుంది. దీంతో మాట్లాడడం కష్టంగా ఉంటుంది. దీనిని కూడా మనం అనుమానించాల్సిందే.
గొంతునొప్పి..
ఇది గొంతు దగ్గర్లో ఉన్నట్లైతే గొంతు నొప్పి ఉంటుంది. మాట తేడాగా మారుతుంది. బొంగురుపోయినట్లుగా మాట వస్తుంది. గొంతులో ఏదో ఇరుక్కున్నట్లుగా ఉంటుంది. ఏం చేసినా గొంతు నొప్పి తగ్గదు.
కారణాలు..
- ఎక్కువగా స్మోక్ చేయడం
- ఆల్కహాల్ తీసుకోవడం
- పొగాకు పదార్థాలు తీసుకోవడం
- తమలపాకులు
- ఇంట్లో ఎవరికైనా ఇదివరకే క్యాన్సర్ ఉంటే జన్యు కారణాల కారణంగా వస్తుంది.
- నాలుపై ఉన్న ఆరోగ్య కణాల DNA మారి విపరీతంగా పెరిగినప్పుడు
- HPV వైరస్ కారణంగా కూడా క్యాన్సర్ వస్తుంది.
ట్రీట్‌మెంట్..
ఈ సమస్యకి ట్రీట్‌మెంట్ మీకు వచ్చిన క్యాన్సర్‌ని బట్టి ఉంటుంది. ముందుగా మీరు డాక్టర్‌ని సంప్రదిస్తే సమస్య ఏంటి, ఎలా వచ్చింది. ఎంత వరకూ సమస్య పెరిగిందో గమనిస్తారు. ఆ తర్వాత మీకు రేడియేషన్, కీమో, ఇమ్యూనో, సర్జరీ ఈ ట్రీట్‌మెంట్స్‌లో ఏవి అవసరమో వాటిని ప్రారంభిస్తారు.
గమనిక :ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
COMMENTS