Success Story: Per month Rs.Earning a thousand. Currently trading at Rs.70 crore annually
Success Story: నెలకి రూ.వెయ్యి సంపాదన.. ప్రస్తుతం ఏటా రూ.70 కోట్ల వ్యాపారం, ఆ ఆలోచనతో సక్సెస్.
Srikanth Bollapalli Story: ప్రస్తుత కాలంలో ఒకప్పుడు చిన్న చూపు చూడబడ్డ రైతన్నలే వినూత్న ఆలోచనలతో ముందుకొస్తూ భారీగా సంపాదిస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు సాంకేతికతను అందిపుచ్చుకుంటూ కొత్త మార్కెటింగ్ పద్ధతులను అవలంభిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన ఒక వ్యక్తి సక్సెస్ స్టోరీ ఇప్పుడు చాలా మందికి ప్రేరణగా నిలుస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది శ్రీకాంత్ బొల్లపల్లి అనే రైతు సక్సెస్ స్టోరీ గురించే. శ్రీకాంత్ తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈయన ప్రస్తుతం పూల వ్యాపారంతో ఏటా కోట్లు గడిస్తున్నాడు. 52 ఎకరాల భూమిలో వివిధ పూలను సాగుచేస్తూ దాదాపు 200 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. దీని ద్వారా రూ.70 కోట్ల టర్నోవర్ సాధిస్తూ పట్టువదలని సంకల్పంతో సాగటం చాలా మంది యువతను ఆకర్షిస్తోంది. అయితే ఈ విజయ ప్రయాణం అంత సులువుగా ప్రారంభం కాలేదు.
శ్రీకాంత్ తన చిన్నతనంలో పేదరికంలో మగ్గాడు. సాంప్రదాయ వ్యవసాయ కుటుంబంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. బాల్యంలో ఉన్న ఆర్థిక కష్టాల కారణంగా 10వ తరగతితో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. కుటుంబ పోషణకు సహాయం చేసేందుకు 16వ ఏట బెంగళూరులోని తన బంధువుల వద్ద పూల వ్యాపారం చేసేందుకు వెళ్లాడు. అయితే అతడు ఆ సమయంలో నెలకు కేవలం 1000 రూపాయలు సంపాదించేవాడు. ఈ సమయంలో సంపాదన తక్కువే ఉన్నప్పటికీ పూల సాగు, మార్కెటింగ్ వ్యాపారంపై అవగాహన పెంచుకుని, లోటుపాట్లు- మెళకులవలు అర్థం చేసుకున్నాడు.
అలా 1997లో సాహసం చేసి సొంతంగా చిన్న పూల దుకాణం ప్రారంభించాడు. బెంగళూరు లాంటి మహానగరంలో సొంతంగా వ్యాపారం చేయటం అనే పెద్ద సాహసోపేతమైన నిర్ణయం అంతి సులువైనది కాదని మనందిరికీ తెలిసిందే. దానిని ఎన్ని సమస్యలు ఎదురైనా 10 ఏళ్ల పాటు కొనసాగించాడు. సంతృప్తికరమైన రాబడి ఉన్నప్పటికీ పెద్ద ఏమైనా చేయాలని చేయాలనే సంకల్పంతో దాచుకున్న మెుత్తంతో 10 ఎకరాల్లో పూల సాగు మెుదలుపెట్టాడు. ఈ ప్రయాణంలో ముందుకు సాగుతూ తన పూల తోటలను 52 ఎకరాలకు విస్తరించాడు.
ప్రస్తుతం శ్రీకాంత్ బెంగళూరులోని దొడ్డబళ్లాపుర సమీపంలోని గ్రీన్‌హౌస్‌లు, పాలీహౌస్‌లలో సేంద్రియ పద్ధతిలో గులాబీలు, గెర్బెరాస్, కార్నేషన్‌లు, జిప్సోఫిలాతో సహా 12 రకాల పూలను సాగుచేస్తున్నారు. ఈ పూలను మార్కెటింగ్ చేస్తూ కోట్లలో ఆర్జిస్తున్నారు. ఏదైనా నచ్చిన విషయాన్ని చిన్నగా ప్రారంభించినప్పటికీ అకుంటిద దీక్షతో పనిచేస్తే పెద్దది మార్చి విజయాలు సొంతం చేసుకోవచ్చని తెలంగాణ రైతుబిడ్డ మరోసారి నిరూపించాడు.
COMMENTS