PMJAY Apply : Online Pradhan Mantri Jana Arogya Yojana Scheme E-Card
PMJAY Apply : ఆన్‌లైన్‌లో ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన స్కీమ్ ఈ-కార్డ్ ఎలా పొందాలో తెలుసా? ప్రాసెస్ ఇదే.
Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana - PMJAY : నిరుపేద వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన స్కీమ్ తీసుకొచ్చింది. అదే ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన పీఎంజేఏవై (PMJAY Yojana). ఈ స్కీమ్ ద్వారా కేంద్రం ప్రతి ఏటా ఒక్కో కుంటుంబానికి ఉచితంగా రూ. 5 లక్షల వరకు సాయం అందిస్తోంది. ఈ స్కీమ్ లో లబ్దిదారులను సామాజిక, ఆర్థిక పరిస్థితులను బట్టి ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం..
ఎలిజిబిలిటీ ఇలా చెక్ చేసుకోండి:
- మొదట https://pmjay.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించిన తర్వాత AM I Eligible ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీ ఆధార్కు లింకై ఉన్న మొబైల్ నంబర్ లేదా SECC పేరును ఎంటర్ చేయాలి.
- వివరాలను సబ్మిట్ చేసిన తర్వాత మీకు OTP వస్తుంది.
- ఈ స్కీమ్కు మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు అందులో కన్పిస్తాయి.
గమనిక :ఈ పథకానికి మీరు అర్హత కలిగి ఉంటే అప్లికేషన్ కోసం అవసరమైన పత్రాలు ఉన్నాయో లేదా చూసుకోవటం ముఖ్యం. ఆధార్ కార్డ్ (Aadhaar Card), రేషన్ కార్డ్ (Ration Card), పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ వంటి ఐడీ ప్రూఫ్ (ID Proof) ఉండాలి.
ఇలా అప్లయ్ చేసుకోవాలి:
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హత కలిగిన లబ్ధిదారులు సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని సందర్శించాలి.
ఈ కేంద్రాలలో శిక్షణ పొందిన సిబ్బంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీకు సహాయం చేస్తారు.
PM-JAY పోర్టల్‌లో అందుబాటులో ఉన్న అధికారిక CSC లొకేటర్‌ని సందర్శించడం ద్వారా మీకు సమీపంలో ఉన్న CSC సెంటర్ను గుర్తించొచ్చు. అలాగే.. CSCలో ఆపరేటర్ మీ ఎలిజిబిలిటీని వెరిఫై చేస్తారు. ఆపై అప్లికేషన్ను ఫిల్ చేయటంలో మీకు సహాయం చేస్తారు.
AB PMJAY e-Card ఇలా పొందాలి :
అప్లికేషన్‌ను విజయవంతంగా సబ్మిట్ చేశాక వివరాలన్నీ వెరిఫై చేస్తారు.
అన్నీ వివరాలు సరిగా ఉంటే ఆ తర్వాత CSC ఆపరేటర్ మీకు ఆయుష్మాన్ భారత్ ఈ-కార్డ్ ఇస్తారు. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ కార్డ్ మీ హెల్త్ కార్డ్‌గా పనిచేస్తుంది. ఈ కార్డు ద్వారా ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స పొందొచ్చు.
హాస్పిటల్స్ లిస్ట్ వెతకడం ఎలాగో తెలుసా:
ఆయుష్మాన్ భారత్ ఈ-కార్డ్‌ని పొందిన తర్వాత ఏదైనా ప్యానలైజ్డ్ హాస్పిటల్‌లో ఉచితంగా చికిత్స పొందొచ్చు.
ఈ పథకం కింద ప్యానెల్‌లో చేర్చిన హాస్పిటల్స్ లిస్ట్ PMJAY వెబ్‌సైట్‌లో Find Hospital ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.
ఈ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే.. https://hospitals.pmjay.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది.
అందులో మీ లొకేషన్ అంటే మీ రాష్ట్రం, జిల్లాను ఎంచుకోండి. ఇప్పుడు మీకు సమీపంలో ఉన్న ఆస్పత్రుల లిస్ట్ కన్పిస్తుంది. మీకు నచ్చిన హాస్పిటల్‌ని ఎంపిక చేసుకుని AB PM-JAY కార్డ్‌ని ఉపయోగించి ఉచితంగా చికిత్స పొందొచ్చు.
COMMENTS