NICL Assistant: 500 Assistant Posts in National Insurance Company
NICL Assistant: నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 500 అసిస్టెంట్ పోస్టులు.
కోల్‌కతాలోని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ప్రధాన కార్యాలయం... దేశవ్యాప్తంగా ఎన్‌ఐసీఎల్ కార్యాలయాల్లో ఓపెన్ మార్కెట్ ప్రాతిపదికన క్లాస్-III కేడర్‌లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 24 - నవంబర్ 11 తేదీల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:
అసిస్టెంట్ (క్లాస్-III కేడర్): 500 (ఎస్సీ- 43; ఎస్టీ- 33; ఓబీసీ- 113; ఈడబ్ల్యూఎస్- 41; యూఆర్- 270).
ఆంధ్రప్రదేశ్‌లో 21, తెలంగాణ రాష్ట్రంలో 12 ఖాళీలు ఉన్నాయి.
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. అభ్యర్థి దరఖాస్తు చేసే రాష్ట్రానికి సంబంధించి ప్రాంతీయ భాష చదవడం, రాయడం, మాట్లాడటం అవసరం.
వయస్సు: 01.10.2024 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
పే స్కేల్: నెలకు రూ.22,405- రూ.62,265.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ టెస్ట్) సబ్జెక్టులు: ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఆబ్జెక్టివ్ (30 ప్రశ్నలు- 30 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ ఆబ్జెక్టివ్ (35 ప్రశ్నలు- 35 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఆబ్జెక్టివ్ (35 ప్రశ్నలు- 35 మార్కులు).
ప్రశ్నల సంఖ్య: 100. మొత్తం మార్కులు 100.
పరీక్ష వ్యవధి: 60 నిమిషాలు.
మెయిన్ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ టెస్ట్) సబ్జెక్టులు: టెస్ట్ ఆఫ్ రీజనింగ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ (40 ప్రశ్నలు- 40 మార్కులు), టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్‌నెస్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు)
ప్రశ్నల సంఖ్య: 200. మొత్తం మార్కులు 200.
పరీక్ష వ్యవధి: 120 నిమిషాలు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు, హైదరాబాద్/ రంగారెడ్డి, వరంగల్.
తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ ఎగ్జామినేషన్ కేంద్రాలు: హైదరాబాద్.
దరఖాస్తు ఫీజు: రూ.850. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.100.
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 24 అక్టోబర్ 2024.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: నవంబర్ 11, 2024.
దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీలు: 24 అక్టోబర్ 2024 నుంచి 11 నవంబర్ 2024 వరకు.
ఫేజ్-I ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 30 నవంబర్ 2024.
ఫేజ్-II ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 28 డిసెంబర్ 2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS