Lifestyle: Do you know why legs and arms tremble when angry?
Lifestyle: కోపం వస్తే కాళ్లు, చేతులు ఎందుకు వణుకుతాయో తెలుసా.?
కోపం.. ప్రతీ ఒక్కరీలో కనిపించే సర్వసాధారణమైన ఎమోషన్. మనిషికి సంతోషం, దుఃఖం ఎలాగో కోపం కూడా అలాగే. మనకు నచ్చిన పని జరిగినా, మనల్ని ఎవరైనా చిరాకు పెడుతున్నా వెంటనే కోపంతో ఊగిపోతుంటాం. తన కోపం తనకు శత్రువు అని పెద్దలు చెప్పిన సామెత ఉండనే ఉంది. కోపం అనే ఎమోషన్ మనిషిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కోపంతో ఊగిపోయే సమయంలో కాళ్లు, చేతులు వణుకుతుంటాయి. అయితే అసలు కోపంలో కాళ్లు, చేతులు ఎందుకు వణుకుతాయో ఎప్పుడైనా ఆలోచించారా.? కాళ్లు, చేతులు వణకడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- కోపంతో ఉన్న సమయంలో శరీరంలో అడ్రినలిన్ హార్మోన్‌ను విడుదలవుతుంది. కోపం వల్లే కలిగే పరిస్థితిని ఎదుర్కోవడానికి శరీరాన్ని సిద్ధం చేస్తుంది. ఈ కారణంగానే శరీరంలో వణుకు మొదలవుతుంది. ఇది కోపం లేదా ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఉపయోగపడుతుంది.
- కోపం వచ్చిన సమయంలో కండరాలు ఒక్కసారిగా బిగుసుకుపోతాయి. దీనివల్ల చేతులు, కాళ్లలో వణుకుమొదలువుంది. కోపంగా ఉన్న వ్యక్తి నియంత్రణను కోల్పోయిన సమయంలో తరచూగా ఇలా జరుగుతుంది.
- సాధారణంగా కోపం వచ్చిన సమయంలో హృదయ స్పందన ఒక్కసారిగా పెరుగుతుంది. ఇది శరీరంలో రక్తప్రసరణ పెరగడానికి కారణమవుతుంది. దీని కారణంగా చేతులతో పాటు శరీరంలో కంపనం ప్రారంభమవుతుంది. గుండె కొట్టుకోవడం పెరగడం వల్ల శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది. ఇది నియంత్రణ కోల్పోయే అనుభూతికి కూడా దారి తీస్తుంది.
- ఒత్తిడి, ఆందోళన ఎక్కువైనా చేతులు, కాళ్లు వణుకుతాయని నిపుణులు అంటున్నారు. మానసిక, శారీరక అలసట కారణంగా కూడా ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
ఎలా బయటపడాలి..
కోపం వచ్చిన సమయంలో లోతైన శ్వాసను తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో ఒక్కసారిగా ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. ఇది వణకడాన్ని తగ్గిస్తుంది. ప్రతిరోజూ యోగా, మెడిటేషన్ వంటి వాటిని అలవాటు చేసుకోవాలి. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. విపరీతమైన కోపం వచ్చిన సమయంలో కాసేపు కళ్లు మూసుకొని ప్రశాంతంగా కూర్చుని ఒక గ్లాసు మంచి నీటిని తాగాలి. ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఎలాంటి విషయాలు వింటే, ఎలాంటివి చూస్తే కోపం వస్తుందో వాటికి దూరంగా ఉండడం అలవాటు చేసుకోవాలి.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
COMMENTS