Want a PAN card in one day?- Download for free!
ఒక్కరోజులోనే పాన్‌కార్డు కావాలా?- ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండిలా!
Free Instant e-PAN: ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలు చేసే వారికి పాన్ కార్డు అనేది తప్పనిసరి అయిపోయింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరి దగ్గరా పాన్ కార్డు ఉంటే మంచిది. అయితే కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న సందర్భంలో కార్డు వచ్చేందుకు కొన్ని రోజులు వేచి ఉండాల్సి వస్తోంది. అలాంటి సందర్భాల్లో అత్యవసరంగా పాన్ కార్డు కావాల్సివస్తే ఎలా? అయితే అలాంటి సందర్భాల్లో కేవలం 24 గంటల్లోనే మనం ఇన్స్టాంట్ పాన్ కార్డు తీసుకోవచ్చు. ఇదే ఇ-పాన్ కార్డు. దీన్ని మనం ఇంట్లో కూర్చునే మొబైల్ ఫోన్లో ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం రండి.
Free Instant e-PAN కోసం అప్లై చేసుకోవటం ఎలా?
Step 1: మొదట Income Tax Department వెబ్‌సైట్‌ను గూగుల్‌లో సెర్చ్ చేయండి.
Step 2: ఇప్పుడు హోమ్ స్క్రీన్‌లో కన్పిస్తున్న క్విక్ లింక్స్‌లోకి వెళ్లి e-PAN ఆప్షన్ ఎంచుకుని Get New e-PAN ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
Step 3: తర్వాత అందులో మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి కింద కన్పిస్తున్న I Confirm That Checkboxపై ప్రెస్ చేసి Continue ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
Step 4: ఇప్పుడు మీ ఆధార్ రిజిస్టర్డ్ నంబర్‌కు 6 అంకెల OTP వస్తుంది. దీన్ని ఎంటర్ చేసిన తర్వాత మీ వివరాలు స్క్రీన్‌పై కన్పిస్తాయి.
Step 5: ఆ వివరాలన్నీ సరిగా ఉన్నాయో లేదో ఓసారి చెక్ చేసి I Accept That Checkboxపై క్లిక్ చేసి కంటిన్యూ ఆప్షన్‌పై ప్రెస్ చేయండి.
Step 6: అంతే ఇప్పుడు మీ e-PAN కోసం అప్లై చేయటం పూర్తయినట్లే. ఆ తర్వాత మీకు అక్నాలెడ్జ్మెంట్ నంబర్ వస్తుంది. దాన్ని ఎక్కడైనా సేవ్ చేసుకుంటే మంచిది.
Step 7: మీరు ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేసిన తర్వాత మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్‌కు కన్ఫర్మేషన్ నంబర్ వస్తుంది. వెంటనే Get New e-PAN పక్కనే ఉండే చెక్ స్టేటస్ లేదా డౌన్లోడ్ పాన్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.
Step 8: ఇప్పుడు మీ ఆధార్ నంబర్, OTP ఎంటర్ చేస్తే మీ పాన్ కార్డు వివరాలు కనిపిస్తాయి. అక్కడే New e-PAN, Download e-PAN ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు New e-PANను డౌన్లోడ్ చేసుకుంటే అయిపోతుంది.
COMMENTS