TG Ration Card: New Rules for Ration Cards Do you know how much income should be?
TG Ration Card: రేషన్ కార్డులకు కొత్త రూల్స్.. ఆదాయం ఎంత ఉండాలో తెలుసా?
TG Ration Card: తెలంగాణ ప్రజలకు మరో రెండు నెలల్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. కుటుంబాల వార్షిక ఆదాయం ఆధారంగానే కార్డులు ఇచ్చేందుకు క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆదాయ పరిమితి తగ్గించాలా, ఉన్నదాన్నే కొనసాగించాలా అన్నదానిపై కమిటీ చర్చిస్తోంది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ నేతృత్వంలో గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఏపీలో అమల్లో ఉన్న విధానాలను ఇప్పటికే అధ్యయనం చేయగా.. నివేదికను ఉపసంఘానికి అందించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
సంక్షేమ పథకాల్లోనూ వినియోగం..
పౌరసరఫరాల వస్తువుల కోసమే కాకుండా పలు సంక్షేమ పథకాల్లోనూ వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయ పరిమితి నిర్ధారణ విషయంలో కొత్త రేషన్, హెల్త్‌కార్డుల జారీపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం పలు మార్పులు చేయనుంది. ఈ మేరకు గ్రామీణ ప్రాంతంలో రూ.1.50 లక్షలు, అర్బన్‌లో రూ.2 లక్షలలోపు ఆదాయాన్ని కార్డుల జారీకి ప్రాతిపదికగా తీసుకోనున్నారు. భూవిస్తీర్ణం తరి అయితే 3.5 ఎకరాలు, మాగాణికి 7.5 ఎకరాలలోపు ఉండాలని నిబంధన పెట్టనున్నారు.
వార్షికాదాయం అర్హతగా..
తెలంగాణలో 89.96 లక్షల కార్డులుండగా వాటి పరిధిలో 2.81 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. వీటిలో 5.66 లక్షలు అంత్యోదయ, 5,416 కార్డులు అన్నపూర్ణ పథకాల కింద ఉన్నాయి. కార్డుల జారీకి వార్షికాదాయాన్ని అర్హతగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం గ్రామీణం, అర్బన్ ప్రాంతాలకు వేర్వేరుగా ఆదాయ పరిమితి ఉండగా కొత్తగా జారీ చేయనున్న విధివిధానాల్లోనూ అవే కొనసాగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 21న నిర్వహించే తుది సమావేశంలోపు తుది నీర్ణయం వెల్లడించనున్నారు.
COMMENTS