TG DSC Results 2024
TG DSC Results 2024 : ఏ క్షణమైనా డీఎస్సీ ఫైనల్ 'కీ'..! వారం రోజుల్లో తుది ఫలితాలు.
TG DSC Results 2024 Updates : టీజీ డీఎస్సీ -2024 ఫలితాలను ప్రకటించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రాథమిక ‘కీ’పై అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాల పరిశీలన పూర్తి కావొచ్చింది. ఏ క్షణమైనా ఫైనల్ కీ ని అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. త్వరలోనే తుది ఫలితాలు కూడా విడుదల కానున్నాయి.
తెలంగాణ డీఎస్సీ ఫలితాలను ప్రకటించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేయగా… భారీగా అభ్యంతరాలు వచ్చాయి. వీటి పరిశీలన పూర్తి అయినట్లు తెలిసింది. అన్ని కుదిరితే ఈ వారం రోజుల్లోనే ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
ఏ క్షణమైనా డీఎస్సీ ఫైనల్ కీని అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్ 4, 5 తేదీల్లో వస్తుందని భావించినప్పటికీ విడుదల కాలేదు. అయితే సెప్టెంబర్ 6 లేదా 7 తేదీన అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
డీఎస్సీ పరీక్షల ప్రాథమిక 'కీ'లపై భారీగా అభ్యంతరాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏకంగా 28 వేలకుపైగా అభ్యంతరాలు అందాయి. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా… ఈసారి జరిగిన పరీక్షపై అత్యధిక స్థాయిలో అభ్యంతరాలు వచ్చాయి. ఇందులో కొన్ని ప్రశ్నలకు సంబంధించే ఎక్కువ అభ్యంతరాలు వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఫైనల్ కీ విడుదల ఆలస్యమైందని సమాచారం.
ఆగస్టు 13న రెస్పాన్స్ షీట్లు, ప్రిలిమినరీ కీని విద్యాశాఖ విడుదల చేసింది. ఆగస్టు 20వ తేదీతో అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసింది.
ఫైనల్ కీ విడుదల తర్వాత… జిల్లాల వారీగా మెరిట్ జాబితా వెల్లడి చేయనున్నారు. మెరిట్ జాబితా జారీ విడుదల తర్వాత ధ్రువపత్రాల పరిశీలన చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా కొత్త టీచర్ల సేవలను వాడుకోవాలన్న ఉద్దేశ్యంతో సర్కార్ ఉంది. ఈ విషయంలో ఓ డెడ్ లైన్ కూడా పెట్టుకుని పని చేస్తోంది. ఫలితాల విడుదలపై డిప్యూటీ సీఎం భట్టి గురువారం కీలక ప్రకటన చేశారు. త్వరలోనే కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలవుతుందన్నారు. ఇప్పటికే నిర్వహించిన పరీక్షల ఫలితాలు వారం రోజుల్లో విడుదలవుతాయని చెప్పుకొచ్చారు.
డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 87.61 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అంటే 2,45,263 మంది పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 34,694 మంది అభ్యర్ధులు పరీక్షలు రాయలేదు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టులకు 92.10 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 టీచర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు.
COMMENTS