Spam Calls Filter : Are spam calls bothering you asking for a loan?
Spam Calls Filter : లోన్ కావాలా అంటూ స్పామ్ కాల్స్ వేధిస్తున్నాయా..? ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకుంటే చాలు.. ఇక నో స్పామ్ కాల్స్!
How to stop Spam Calls : నేటి సాంకేతిక యుగంలో ఆన్‌లైన్ మోసాలు విపరీతంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా.. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు స్పామ్ కాల్స్ వేధింపులు కూడా గణనీయంగాపెరిగాయి. తీరికలేని పనిలో ఉన్నప్పుడు కొత్త నంబర్ నుంచి పోన్ రాగానే.. కొత్తవారు చేస్తున్నారనే ఆసక్తితో కాల్ లిఫ్ట్ చేస్తాం. లోన్ కావాలా? క్రెడిట్ కార్డ్ ఇస్తామంటూ బుర్ర తినేస్తారు. స్పామ్ కాల్ అని తెలిసి పట్టరానంత కోపం వస్తుంది. అవసరంలేదని చెప్పినా.. పదే పదే ఇలాంటి కాల్స్ వస్తుంటే.. ఒకింత అసహనానికి గురవుతాం. మరోవైపు లాటరీ తగిలిందని, మీ క్రెడిట్/డెబిట్ కార్డ్ వ్యాలిడిటీ ముగిసిందంటూ మోసపూరిత కాల్స్ వస్తుంటాయి. ఈ క్రమంలో.. విసుగు పుట్టించే స్పామ్ కాల్స్ ఎలా అడ్డుకోవాలి? వాటికి చెక్ పెట్టేందుకు ఫోన్ సెట్టింగ్స్‌లో ఎలాంటి మార్పులు చేయాలో తెలుసుకుందాం..
ఈ స్పామ్ కాల్స్ బారి నుంచి బయటపడేందుకు ఆండ్రాయిడ్ యూజర్లకు కాలర్ ఐడీ (Caller ID), స్పామ్ ప్రొటెక్షన్ (Spam Protection) అనే రెండు ఫీచర్లను గూగుల్ అందిస్తోంది. యూజర్లు తమ ఫోన్లలో వీటిని ఎనేబుల్ చేసి స్పామ్ కాల్స్‌ను అడ్డుకోవచ్చు.. అదెలాగో చూద్దాం..
- ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఫోన్ యాప్ (Phone App) ఓపెన్ చేసి కుడివైపు పైన ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.
- అందులో కాలర్ ఐడీ అండ్ స్పామ్ ప్రొటెక్షన్ (Caller ID and Spam Protection) అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేయాలి.
- వెంటనే కింద నిబంధనలకు అంగీకరిస్తున్నారా? అని అడుగుతూ అగ్రీ బటన్ చూపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే కాలర్ ఐడీ అండ్ స్పామ్ ప్రొటెక్షన్ ఫోన్‌లో యాక్టివేట్ అవుతుంది.
- ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసినా స్పామ్ కాల్స్ వస్తుంటే.. ఫోన్ యాప్ ఓపెన్ చేసి కింద ఉన్న రీసెంట్స్ సెక్షన్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత మీకు వచ్చిన స్పామ్ కాల్ నంబర్‌పై క్లిక్ చేసి ఫోన్, మెసేజ్, వీడియో, ఐ అని ఐకాన్స్ కనిపిస్తాయి.
- వాటిలో ఐ ఐకాన్‌పై క్లిక్ చేస్తే బ్లాక్, రిపోర్ట్ అని రెండు ఆప్షన్లు ఉంటాయి.
- స్పామ్ కాల్ వచ్చిన నంబర్‌ను బ్లాక్ చేయాలంటే బ్లాక్ ఆప్షన్‌పై, సదరు నంబరుపై రిపోర్ట్ చేయాలంటే రిపోర్టు ఆప్షన్‌పై క్లిక్ చేస్తే, ఆ నంబర్ నుంచి మీకు ఫోన్‌కాల్స్ రావు.
స్పామ్ కాల్ ఫిల్టరింగ్ ఫీచర్ :
- మొదట Play Store నుండి "Phone by Google" యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి.
- "Phone by Google" యాప్‌ని మీ డిఫాల్ట్ డయలర్ యాప్ గా సెట్ చేయండి.
- యాప్‌ని ఓపెన్ చేసిన తర్వాత దాన్ని మీ డీఫాల్ట్ డయలర్‌గా సెట్ చేయమని మీరు ప్రాంప్ట్ చేయబడతారు.
- "డిఫాల్ట్‌గా సెట్ చేయి" ఆప్షన్‌పై , నీలిరంగు చిహ్నంతో "ఫోన్" యాప్‌ను ఎంచుకోండి.
- "డిఫాల్ట్‌గా సెట్ చేయి"ని మళ్లీ క్లిక్ చేయడం ద్వారా మీ సెలక్షన్‌ను నిర్ధారించండి.
- కాలర్ ఐడీ అండ్ స్పామ్ బ్లాక్ సెట్టింగ్‌లను ప్రారంభించండి.
- మెయిన్ స్క్రీన్‌పై మూడు-చుక్కల మెనుని క్లిక్ చేయడం ద్వారా, సెట్టింగ్‌లకు వెళ్లి, ఆపై కాలర్ ఐడీ అండ్ స్పామ్‌ని ఎంచుకోవచ్చు.
- ఈ సెట్టింగ్‌లు డిఫాల్ట్‌గా ప్రారంభించబడకపోతే.. వాటిని ఆన్ చేయండి.
- మీ డిఫాల్ట్ కాలర్ ఐడీ అండ్ స్పామ్ యాప్‌ని అప్‌డేట్ చేయండి.
- కాలర్ ఐడీ, స్పామ్ ఫీచర్ల కోసం సిస్టమ్ ని ఉపయోగించే డిఫాల్ట్ యాప్‌ను మీరు అప్‌డేట్ చేయాలి.
- ఈ సెట్టింగ్ ప్లేస్ ఫోన్ మోడల్ని బట్టి మారుతుంది.. కాబట్టి మీరు మీ సిస్టమ్ సెట్టింగ్‌లలో "డిఫాల్ట్ యాప్‌లు" కోసం వెతకవలసి రావచ్చు. సెట్టింగ్ ఖాళీగా ఉంటే.. కేవలం "ఫోన్" యాప్ గుర్తుని ఎంచుకోవచ్చు.
COMMENTS