RRB Technician: 14,298 Technician Posts in Railway Department
The railway department gave a sweet talk to the job seekers. It is known that the RRB notification was issued last March for the technicians in various railway zones. 9,144 vacancies are mentioned in this notification. The Railway Department issued an official statement on August 22 that it is being increased massively. A total of 14,298 technician posts will be filled in 40 categories in view of the requirements in various railway zones across the country. To this extent, zone wise vacancy details have been revealed. There are 959 vacancies in Secunderabad Railway Zone. Highest in Chennai zone is 2716; The lowest in Siliguri zone is 91 vacancies.
RRB has made it clear that they will be given another opportunity to apply online. The Railway Department said that the candidates who have already applied can correct their application and give priority to the posts. Eligible candidates can apply online from October 2nd to October 16th. Candidates will be selected on the basis of Computer Based Aptitude Test, Document Verification, Medical Examination. Per month for Technician Grade-I Signal Posts Rs.29,200. Technician Grade-III posts have an initial salary of Rs.19,900. Written tests will be conducted soon for the applied candidates.
Advertisement Details:
1. Technician Grade-I Signal (Open Line (): 1,092 Posts
2. Technician Grade-III (Open Line ): 8,052 Posts
3. Technician Grade-III (Work Shop and PUS (): 5,154 Posts
Total Number of Posts: 14,298. (UR - 6171, SC-2014, ST-1152, OBC-3469, EWS - 1481)
RRB Region wise vacancies:
1. RRB Ahmedabad-1015
2. RRB AzMare-900
3. RRB Bangalore-337
4. RRB Bhopal-534
5. RRB Bhubaneswar-166
6. RRB Bilaspur-933
7. RRB Chandigarh-187
8. RRB Chennai-2716
9. RRB Guwahati-764
10. RRB Jammu and Srinagar-721
11. RRB Kolkata-1098
12. RRB Malda-275
13. RRB Mumbai-1883
14. RRB Muzaffarpur-113
15. RRB Patna- 221
16. RRB Prayag Raj-338
17. RRB Ranchi-350
18. RRB Secunderabad- 959
19. RRB Siliguri-91
20. RRB Thiruvananthapuram-278
21. RRB Gorakhpur - 419
Qualifications:
Technician Grade-I Signal: Must have passed B.Sc, BE/B.Tech, Diploma (Physics/ Electronics/ Computer Science/IT/Instrumentation).
Technician Grade-III: Matriculation/SSLC, ITI (Electrician/ Wire Man/ Electronics Mechanic Power Electronics/ Mechanic Electronics/ Mechanic/ Fitter/ Welder/ Painter General/ Machinist/ Operator Advanced Machine Tool/ Machinist/ Mechanic Mechanic Mechanic/ Mechanic Mechatronics / Mechanic Diesel / Mechanic (Motor Vehicle)/ Turner/ Operator Advanced Machine Tool/ Gas Cutter/ Heat Treater/Foundryman/Foundryman/Paturn Mouter Mouter Maker etc. or 10+2 (Physics, Maths) must have passed.
Age Limit: 18-36 years for Technician Grade-I Signal Posts as on 01-07-2024; Technician Grade-III posts should be between 18-33 years old. SC/ST for five years; There is a relaxation of three years for OBCs and 10-15 years for the disabled.
Starting Salary: Rs.29,200 for Technician Grade-I Signal Posts per month. 19,900 for Technician Grade-III posts.
Application Fee: Rs.250 for SC, ST, ex-servicemen, women, transgender, minority, EBC candidates. Others Rs.500.
Selection Process: Selection will be based on Written Test (Computer Based Aptitude Test), Document Verification, Medical Examination.
Question Paper: Technician Grade-I Signal Question Paper includes General Awareness (10 Questions, 10 Marks), General Intelligence and Reasoning (15 Questions, 15 Marks), Basics of Computers and Applications (20 Questions, 20 Marks), Mathematics (20 Questions, 20 Marks), Basic Science and Engineering (35 Questions, 35 Marks). Questions will come. Technician Grade-III question paper includes questions on Mathematics (25 Questions, 25 Marks), General Intelligence and Reasoning (25 Questions, 25 Marks), General Science (40 Questions, 40 Marks), General Awareness (10 Questions, 10 Marks). Exam duration is 90 minutes. Total marks are 100.
Important dates.
Start of Online Applications: 02-10-2024.
Last date for online application: 16-10-2024.
Application Amendment Dates: 17.10.2024 to 21.10.2024.
highlights.
- The Railway Department has issued a notification for the recruitment of 14,298 technician posts.
- Eligible candidates can apply online from October 2nd to October 16th.
- Candidates will be selected on the basis of Computer Based Aptitude Test, Document Verification, Medical Examination.
- Written tests will be conducted soon for the applied candidates.
RRB Technician: రైల్వే శాఖలో 14,298 టెక్నీషియన్ పోస్టులు
ఉద్యోగార్థులకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. వివిధ రైల్వే జోన్లలో టెక్నీషియన్ కొలువులకు గత మార్చిలో ఆర్‌ఆర్‌బీ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌లో 9,144 ఖాళీలు పేర్కొనగా.. దీన్ని భారీగా పెంచుతున్నట్లు రైల్వే శాఖ ఆగస్టు 22న అధికారిక ప్రకటనను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో అవసరాల దృష్ట్యా 40 కేటగిరీల్లో మొత్తం 14,298 టెక్నీషియన్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ మేరకు జోన్ల వారీగా ఖాళీల వివరాలు వెల్లడయ్యాయి. సికింద్రాబాద్ రైల్వే జోన్‌లో 959 ఖాళీలున్నాయి. అత్యధికంగా చెన్నై జోన్‌లో 2716; అత్యల్పంగా సిలిగురి జోన్‌లో 91 ఖాళీలు ఉన్నాయి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు మళ్లీ అవకాశం కల్పించనున్నట్లు ఆర్‌ఆర్‌బీ స్పష్టం చేసింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తును సరిదిద్దడంతో పాటు పోస్టుల ప్రాధామ్యాలు ఇచ్చుకోవచ్చని రైల్వే శాఖ తెలిపింది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నెలకు టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు రూ.29,200. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900 ప్రారంభ వేతనం ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు త్వరలో రాత పరీక్షలు నిర్వహిస్తారు.
ప్రకటన వివరాలు:
1. టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్(ఓపెన్ లైన్): 1,092 పోస్టులు
2. టెక్నీషియన్ గ్రేడ్-III(ఓపెన్ లైన్): 8,052 పోస్టులు
3. టెక్నీషియన్ గ్రేడ్-III(వర్క్‌షాప్ అండ్ పీయూఎస్): 5,154 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 14,298. (యూఆర్- 6171, ఎస్సీ- 2014, ఎస్టీ- 1152, ఓబీసీ- 3469, ఈడబ్ల్యూఎస్- 1481)
ఆర్‌ఆర్‌బీ రీజియన్ వారీగా ఖాళీలు:
1. ఆర్‌ఆర్‌బీ అహ్మదాబాద్- 1015
2. ఆర్‌ఆర్‌బీ అజ్‌మేర్- 900
3. ఆర్‌ఆర్‌బీ బెంగళూరు- 337
4. ఆర్‌ఆర్‌బీ భోపాల్- 534
5. ఆర్‌ఆర్‌బీ భువనేశ్వర్- 166
6. ఆర్‌ఆర్‌బీ బిలాస్‌పూర్- 933
7. ఆర్‌ఆర్‌బీ చండీగఢ్- 187
8. ఆర్‌ఆర్‌బీ చెన్నై- 2716
9. ఆర్‌ఆర్‌బీ గువాహటి- 764
10. ఆర్‌ఆర్‌బీ జమ్ము అండ్ శ్రీనగర్- 721
11. ఆర్‌ఆర్‌బీ కోల్‌కతా- 1098
12. ఆర్‌ఆర్‌బీ మాల్దా- 275
13. ఆర్‌ఆర్‌బీ ముంబయి- 1883
14. ఆర్‌ఆర్‌బీ ముజఫర్‌పూర్- 113
15. ఆర్‌ఆర్‌బీ పట్నా- 221
16. ఆర్‌ఆర్‌బీ ప్రయాగ్‌రాజ్- 338
17. ఆర్‌ఆర్‌బీ రాంచీ- 350
18. ఆర్‌ఆర్‌బీ సికింద్రాబాద్- 959
19. ఆర్‌ఆర్‌బీ సిలిగురి- 91
20. ఆర్‌ఆర్‌బీ తిరువనంతపురం- 278
21. ఆర్‌ఆర్‌బీ గోరఖ్‌పూర్- 419
అర్హతలు:
టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్: బీఎస్సీ, బీఈ/ బీటెక్, డిప్లొమా (ఫిజిక్స్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఇన్‌స్ట్రుమెంటేషన్) ఉత్తీర్ణలై ఉండాలి.
టెక్నీషియన్ గ్రేడ్-III: మెట్రిక్యులేషన్/ ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ (ఎలక్ట్రీషియన్/ వైర్‌మ్యాన్/ ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్/ మెకానిక్/ ఫిట్టర్/ వెల్డర్/ పెయింటర్ జనరల్/ మెషినిస్ట్/ కార్పెంటర్/ ఆపరేటర్ అడ్వాన్స్‌డ్ మెషిన్ టూల్/ మెషినిస్ట్/ మెకానిక్ మెకానిక్/ మెకానిక్ మెకాట్రానిక్స్/ మెకానిక్ డీజిల్/ మెకానిక్ (మోటార్ వెహికిల్)/ టర్నర్/ ఆపరేటర్ అడ్వాన్స్‌డ్ మెషిన్ టూల్/ గ్యాస్ కట్టర్/ హీట్ ట్రీటర్/ ఫౌండ్రీమ్యాన్/ ప్యాటర్న్ మేకర్/ మౌల్డర్ తదితరాలు). లేదా 10+2 (ఫిజిక్స్, మ్యాథ్స్) ఉత్తీర్ణలై ఉండాలి.
వయోపరిమితి: 01-07-2024 నాటికి టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు 18-36 ఏళ్లు; టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు 18-33 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10- 15 ఏళ్ల సడలింపు ఉంది.
ప్రారంభ వేతనం: నెలకు టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు రూ.29,200. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.500.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్రశ్నపత్రం: టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ ప్రశ్నపత్రంలో జనరల్ అవేర్‌నెస్ (10 ప్రశ్నలు, 10 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (15 ప్రశ్నలు, 15 మార్కులు), బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ (20 ప్రశ్నలు, 20 మార్కులు), మ్యాథమెటిక్స్ (20 ప్రశ్నలు, 20 మార్కులు), బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (35 ప్రశ్నలు, 35 మార్కులు) అంశాలపై ప్రశ్నలు వస్తాయి. టెక్నీషియన్ గ్రేడ్-III ప్రశ్నపత్రంలో మ్యాథమెటిక్స్ (25 ప్రశ్నలు, 25 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (25 ప్రశ్నలు, 25 మార్కులు), జనరల్ సైన్స్ (40 ప్రశ్నలు, 40 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (10 ప్రశ్నలు, 10 మార్కులు) అంశాలపై ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. మొత్తం మార్కులు 100.
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 02-10-2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16-10-2024.
దరఖాస్తు సవరణ తేదీలు: 17.10.2024 నుంచి 21.10.2024 వరకు.
ముఖ్యాంశాలు...
- 14,298 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
- అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
- కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు త్వరలో రాత పరీక్షలు నిర్వహిస్తారు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS