Mail the Baby: Did you know that children were sent from one place to another by postal.
Mail the Baby: పోస్టల్ ద్వారా పిల్లల్ని ఒక చోట నుంచి మరొక పంపించేవారని మీకు తెలుసా..! కండిషన్స్ అప్లై.
ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఉన్నా సరే పచ్చళ్ళు, బట్టలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు వంటి వాటిని ఒక చోట నుంచి మరొక చోటకు చాలా సులభంగా కొరియర్, ఇండియా పోస్ట్ ద్వారా స్పీడ్ పోస్ట్ వంటి వివిధ సదుపాయాల పంపుతున్నారు. అయితే వందేళ్ళ క్రితం ప్రపంచంలో పోస్టల్ వ్యవస్థ మాత్రమే ఉండేది. అప్పుడు వార్తలను ఒక చోట నుంచి మరొక చోటకు లెటర్స్ ద్వారా తెలియజేసేవారు. సెల్ ఫోన్లు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రాక ముందు వరకూ పోస్ట్ మెన్ తెచ్చే ఉత్తరం కోసం ఎదురుచూసిన వారున్నారు. అంతేకాదు మనీయార్దర్ ద్వారా డబ్బులను వివిధ రకాల సేవల ద్వార వస్తువులను కూడా ఒక చోట నుంచి మరొక చోటకు పంపించేవారు. ప్రాణం ఉన్న జీవులను పోస్టల్ ద్వారా మాత్రం పంపించరు. అయితే వంద సంవత్సరాల క్రితం పోస్టల్ వ్యవస్థ ద్వారా పిల్లల్ని ఒక చోట నుంచి మరొక చోటకు పంపించేవారు అని తెలుసా..!
వందల ఏళ్ల క్రితం పోస్టల్ వ్యవస్థ ద్వారా పిల్లల్ని 15 సెంట్ల పోస్టల్ స్టాంప్ అతికించి పోస్టులో పంపేవారు. ఇలా పిల్లల్ని పంపించే సమయంలో వారికీ 50 డాలర్ల ఇన్సూరెన్స్ కూడా చేసే వారు. ఇలా పోస్టల్ వ్యవస్థ ద్వారా చేరవేసే పిల్లలు రైల్లో 700 మైళ్ళు ప్రయాణం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తొలిసారిగా పోస్టల్ ద్వారా 1914లో నాలుగేళ్ల పాప తొలిసారిగా పోస్టల్ ద్వారా ప్రయాణించింది. ఆ పాప 73 మైళ్ళు ప్రయాణించి తన గమ్య స్థానానికి చేరుకుంది. రైలులో ప్రయాణించే సమయంలో పిల్లలకు తిండి, సదుపాయాలను ఒక అటెండెంట్ ఉండేవాడు. అలా ప్రయాణించే పాపను పోస్ట్ మ్యాన్ రిసీవ్ చేసుకుని చిరునామా ఉన్న ఇంటి యజమానులకు అప్పచెప్పేవాడు. అయితే పోస్టులో పిల్లల్ని పంపించాలంటే ఒకే ఒక కండిషన్ ఉండేది. అది ఏమిటంటే పిల్లల బరువు 50 పౌండ్ల కన్నా తక్కువ ఉండాలి.
COMMENTS