Not just guavas - drinking guava leaves 'tea' has many benefits - you know?
జామకాయలే కాదు - జామ ఆకుల 'టీ' తాగితే ఎన్నో ప్రయోజనాలట! - మీకు తెలుసా?
Guava Leaf Tea Health Benefits : జామకాయ తినచ్చు, జామ పండు జ్యూస్ చేసుకుని తాగచ్చు. కానీ జామ ఆకులు తినచ్చని మీలో ఎంత మందికి తెలుసు. జామ ఆకులను నేరుగా నమిలి తినేవారు కొందరైతే, కాస్త చింతపండు కలిపి తినేవారు మరికొందరు. అంతేకాదు, జామ ఆకులతో టీ కూడా కాచుకోవచ్చని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. జామ కాయలను నేరుగా తింటే, అందులో ఉండే పోషక విలువలు మనకు ఎన్ని ప్రయోజనాలను కలిగిస్తాయో, వాటి ఆకులతో కాచే టీ కూడా శరీరానికి అంతే ప్రయోజనకరం.
జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సీ, లికోపెన్‌లు ఎక్కువగా ఉండి చర్మాన్ని సంరక్షిస్తాయి. ఇంకా ఈ ఆకుల్లో పొటాషియం కూడా ఉండటంతో బీపీ లెవల్స్‌ను స్థిరంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు. జామకాయల్లో 80 శాతం నీరు ఉండటమే కాకుండా, అధిక మోతాదులో ఫైబర్ ఉండి బరువు తగ్గించి పాటు మానవ శరీరంలో మెటబాలిజం మెరుగయ్యేందుకు తోడ్పడుతుంది.
జామ ఆకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!
డయాబెటిస్ :
జపాన్‌లో చాలా మంది తమకు బ్లడ్ షుగర్ లెవల్స్ మితిమీరిపోకుండా,డయాబెటిస్ రాకుండా ఉండేందుకు జామ ఆకుల టీ తాగుతారు. ప్రత్యేకించి ఆహారం తిన్న తర్వాత దీన్ని తీసుకుంటారు. ఎందుకంటే జామ ఆకుల్లో షుగర్‌లో ఉండే సుక్రోజ్, మాల్టోజ్‌ను శోషించుకునే గుణం ఉంటుంది. ఇంకా వీటిల్లో ఉండే ప్రత్యేకమైన ఎంజైములు జీర్ణాశయంలో ఉన్న కార్బొహైడ్రేట్స్‌ను గ్లూకోజ్‌గా మారుస్తాయి.
చెడు కొలెస్ట్రాల్ :
శరీరంలో పేరుకుపోయి ఉన్నచెడు కొవ్వును తగ్గించి గుండె జబ్బులు, ఇతర సమస్యలు రాకుండా కాపాడుతుంది ఈ జామ ఆకుల టీ. కచ్చితంగా ఈ టీని క్రమం తప్పకుండా 8 నుంచి 9 వారాల పాటు తాగితే ఈ బెనిఫిట్ పొందగలం.
చర్మారోగ్యం :
ఈ టీ చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. తక్షణమే ముఖంపై మచ్చలు పోగొట్టే విటమిన్-సీ అధికంగా ఉండటం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.
జుట్టు :
జామ ఆకుల టీ జుట్టు ఊడిపోవడాన్ని తగ్గించి, ఇతర సమస్యలు రాకుండా చేస్తుంది. జామ ఆకులను నీటిలో ఉడికించి, ఆ నీటిని జుట్టు కుదుళ్లలో మసాజ్ చేయాలి. దీనిని మనం తాగొచ్చు కూడా. జుట్టుకు అంతర్గతంగా బలాన్ని ఇచ్చి కుదుళ్లను ఇది దృఢం చేస్తుంది.
డయేరియా :
శరీరంలో డయేరియాకు కారణమయ్యే స్టాఫీలోకోక్కస్ ఆరెస్ (staphylococcus auras) బ్యాక్టీరియా పెరుగుదలను అరికడుతుంది. డయేరియాతో బాధపడే వ్యక్తులు ఎవరైనా రెగ్యూలర్ మెడిసిన్‌తో పాటు జామ ఆకులతో టీ తాగితే నీళ్ల విరేచనాలు ఆగిపోయి కడుపు నొప్పి తగ్గిపపోతుంది.
జలుబు - దగ్గు :
విటమిన్-సీ, ఐరన్ అధికంగా ఉండటం వల్ల జలుబు, దగ్గు రాకుండా రక్షణ కల్పిస్తుంది జామ ఆకుల టీ. వేడిగా ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల కఫాన్ని కూడా తగ్గిస్తుంది. గొంతు, ఊపిరితిత్తులను శుభ్రం చేసి జలుబు, దగ్గు నుంచి త్వరగా కోలుకునేందుకు సహాయం చేస్తుంది. జామ ఆకులతో టీ కాచుకుని తాగితే ఇన్ని బెనిఫిట్స్ పొందొచ్చని మనం అనుకుంటుంటే, మెక్సికో, దక్షిణ అమెరికా లాంటి దేశాల్లో ఆయుర్వేద ట్రీట్మెంట్‌కు కూడా జామ ఆకులను వాడుతుంటారు.
ముఖ్య గమనిక : ఈ వెబ్‌సైట్‌లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది.
COMMENTS