Foods that save you from pollution - if you eat these, safe
పొల్యూషన్ నుంచి కాపాడే ఫుడ్స్- ఇవి తింటే మీరు ఎక్కడున్నా సేఫే!
Foods To Fight Pollution : ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్న అతిపెద్ద సమస్య కాలుష్యం. దీని ప్రభావం మానవ ఎదుగుదలపై తీవ్రంగా పడుతోంది. పుట్టిన బిడ్డ పరిమాణం నుంచి లైంగిక పరిపక్వత, థైరాయిడ్ నియంత్రణ, హార్మోన్ స్థాయిల్లో మార్పుల వరకూ వివిధ రకాలుగా కాలుష్యం మనుషులను ఇబ్బంది పెడుతోంది. ఆక్సీకరణ ఒత్తిడి, అకాల వృద్ధాప్యం, కీళ్లలో మంట, నొప్పి వంటి ఎన్నో దీర్ఘకాలిక సమస్యలను మూల కారణం కాలుష్యం. ఇంత హానికరమైన కాలుష్యం అన్నిచోట్లా ఉన్నప్పటికీ మన ఆరోగ్యంపై దీని ప్రభావాన్ని తగ్గించుకునే అవకాశాలు కొన్ని ఉన్నాయి. కాలుష్యం నుంచి శరీరాన్ని కాపాడే నాలుగు ఆహార పదార్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బెర్రీస్ :
ప్రకృతి అందించే యాంటీఆక్సిడెంట్లకు నిలయం బెర్రీ పండ్లు. స్ట్రాబెర్రీస్, బ్లూ బెర్రీస్, రాస్ప్ బెర్రీస్ వంటి అన్ని బెర్రీ పండ్లలో ఆంథోసైనిన్ అనే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ సమ్మేళనాలు కాలుష్యం కారణంగా తలెత్తే ఆక్సీకరణ ఒడ్డిడిని, హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. మీ ఆహార పదార్థాలలో బెర్రీలను చేర్చుకోవడం వల్ల మీ శరీరానికి సహజ రక్షణ అందుతుంది.
బ్రోకలీ :
బ్రోకలీ వంటి క్రూసిఫరస్ కుటుంబానికి చెందిన కూరగాయలు శక్తివంతమైన నిర్విషీకరణ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇందులోని సల్ఫోరాఫేన్ నిర్విషీకరణ ఎంజైములకు మద్దతు ఇచ్చి.. కాలుష్య కారకాలను తొలగించడంలో సహాయపడుతుంది. పర్యావరణ విష పదార్థాల నుంచి మీ శరీరాన్ని కాపాడే రక్షణ పొరను ఏర్పరుస్తాయి.
పసుపు :
పసుపులో కర్కుమిన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ వంటి క్రియాశీల సమ్మేళనాలు ఉంటాయి. కాలుష్య ప్రభావం శ్వాసకోశ వ్యవస్థపై పడకుండా ఇవి సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మీ భోజనంలో పసుపుని చేర్చుకోవడం వల్ల హానికరమైన కాలుష్య ప్రభావాన్ని తగ్గించుకోవచ్చట. శరీర స్థితిస్థాపకతను మెరుగుపరచవచ్చట.
ఆకుకూరలు :
కాలే, బచ్చలకూర వంటి ఆకుకూరలు మీ శరీరాన్ని కాలుష్యానికి వ్యతిరేకంగా బలపరిచే పోషకాలు కలిగి ఉంటాయి. ఇందులోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మీ రోజూవారీ ఆహారపదార్థాల్లో వీటిని చేర్చడం వల్ల కాలుష్యకారకాల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.
కొవ్వు చేపలు :
సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ వంటి కొవ్వు చేపల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కొవ్వులు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను మెండుగా కలిగి ఉంటాయి. ఇవి కాలుష్యం ద్వారా వచ్చే తాపజనక ప్రతిస్పందనలు ఎదుర్కుంటాయి. ఒమేగా-3 అధికంగ ఉండే చేపలను తరచూ తినడం వల్ల శరీరంపై కాలుష్య ప్రభావం తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
వీటితో పాటు మీ భోజనంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్లు కలిగిన విభిన్న ఆహారాలను చేర్చుకోవడం వల్ల కాలుష్యం నుంచి మిమ్మల్ని రక్షించుకోగలుగుతారు.
COMMENTS