Telangana Group-2 Exam Schedule Released – Exams in December.
TGPSC Group 2 Exam Dates : తెలంగాణ గ్రూప్ -2 పరీక్షల షెడ్యూల్ విడుదల - డిసెంబర్ లో ఎగ్జామ్స్.
గ్రూప్-2 పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఇవాళ షెడ్యూల్‌ను విడుదల చేసింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.
డిసెంబర్ 15న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-1
డిసెంబర్ 15న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్-2
డిసెంబర్ 16న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-3
డిసెంబర్ 16న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్-4
కొద్దిరోజుల కింద డీఎస్సీ పరీక్షలతో గ్రూప్ 2 ఎగ్జామ్స్ ను వాయిదా వేయాలని నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. ఆందోళనల నేపథ్యంలో సర్కార్ నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 2ను వాయిదా వేసి డీఎస్సీని మాత్రం వాయిదా వేయలేదు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… ఆగస్ట్ 7, 8 తేదీల్లోనే గ్రూప్2 పరీక్షలు జరగాల్సి ఉంది. నిరుద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేసింది. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పింది. ఈ క్రమంలోనే టీజీపీఎస్సీ… గ్రూప్ 2 నిర్వహణ కోసం కొత్త తేదీలను వెల్లడించింది.
గతేడాది నోటిఫికేషన్…ఆపై వాయిదాలు
మొత్తం 783 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గతేడాది గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.
తొలుత గతేడాది ఆగస్టు 29, 30న గ్రూప్-2 పరీక్ష నిర్వహిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. వరుసగా గ్రూప్-1, 4 పరీక్షలు, గురుకుల నియామక పరీక్షలతో పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు సమయం లేనందున గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ మేరకు పరీక్షలను నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూలు చేసింది కమిషన్.
నవంబరు 3 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో కమిషన్ ఈ పరీక్షలను మళ్లీ 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూలు చేసింది టీఎస్పీఎస్సీ. కానీ రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో మళ్లీ కొత్త తేదీలను ప్రకటించారు. ఇందులో భాగంగా… ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు ఉంటాయని మార్చి నెలలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరోసారి ప్రకటన చేసింది. ఈ తేదీల్లో కూడా పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు. ఈ తేదీలను కూడా వాయిదా వేస్తూ ప్రకటన చేయాల్సి వచ్చింది.
పరీక్షల నిర్వహణను డిసెంబర్ కు వాయిదా వేయటంతో… గ్రూప్ 2 అభ్యర్థులకు గడువు దొరికినట్లు అయింది. అయితే పోస్టుల సంఖ్యను పెంచుతారా..? లేదా ప్రస్తుతం ఉన్న పోస్టులతోనే ముందుకెళ్తారా…? అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది…!
Important Links:
FOR WEB NOTE CLICKHERE.
COMMENTS