Stickers On Vehicle: Are you stickering quotations on your vehicles..? Be Aware this..
Stickers On Vehicle: మీ వాహనాలపై కొటేషన్లు స్టిక్కరింగ్ చేయిస్తున్నారా..? అయితే మీకు మూడినట్లే..!
హాయ్ అని ఆశ పెట్టకు.. బాయ్ అని బాధ పెట్టకు.. మనల్ని ఎవడ్రా ఆపేది.. నేను మంత్రి గారి తాలూకా..పామునైనా నమ్మవచ్చు కానీ ఆడదాన్ని నమ్మలేం.. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వాహనాలపై ఇలాంటి కోటేషన్లు స్టిక్కరింగ్ చేయించుకునే వారి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా ఎన్నికల తర్వాత ఈ స్టిక్కరింగ్ గోల మరింత ఎక్కువైంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి స్టిక్కరింగ్స్ ఎక్కువయ్యాయి. అయితే ఇలాంటి కోటేషన్లు ఉన్న వాహనాలపై కోల్‌కత్తా పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు. కోల్‌కత్తా పోలీసులు తమ సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్‌లో వాహనదారులకు హెచ్చరికలు జారీ చేశారు. అభ్యంతరకర కోటేషన్లు వాహనాలపై రాస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే నిజంగా మన వాహనాలపై కోటేషన్లు రాయించకూడదా..? నిబంధనలు ఏంటో? ఓ సారి తెలుసుకుందాం.
ఇటీవల కోల్‌కత్తాలోని ఓ వాహనంపై పామునైనా నమ్మవచ్చు..కానీ ఆడదాన్ని నమ్మకూడదు అనే కోటేషన్ ఓ కారుపై ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో వాహన యజమానికిఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 499, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 356 (i) కింద పరువు నష్టం నివారించడానికి స్టిక్కర్ను తొలగించాలని నోటీసు జారీ చేశారు. దీంతో వాహన యజమాని ఆ స్టిక్కర్‌ను తొలగించారు. ఒకరి మనోభావాలను దెబ్బతీసే లేదా కులం, మతానికి సంబంధించిన అసభ్యకరమైన, అవమానకరమైన సందేశాలు, పోస్టర్లు వంటి వాహనాలపై ప్రదర్శించడం మోటారు వాహనాల చట్టం ప్రకారం అనుమతించమని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.
మోటారు వాహనాల చట్టంలో రిజిస్ట్రేషన్ ప్లేట్‌తో సహా కారు లేదా ద్విచక్ర వాహనంపై ఎక్కడా అతికించిన స్టిక్కర్ లేదా సందేశం లేదా మరేదైనా రాయకూడదని స్పష్టంగా పేర్కొన్నారు. . మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 179 (1) వాహనాల పై కుల, మతాలకు సంబంధించిన స్టిక్కర్లు, రాతలను ఉపయోగించకూడదని స్పష్టంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నిబంధనల మీరితే జరిమానాతో పాటు ఇతర చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం కోల్‌కత్తాలో ఈ తరహా స్టిక్కర్లు ఉన్న కార్లు, బైక్‌ల యజమానులపై రూ.1000 జరిమానా విధిస్తున్నారు.
COMMENTS