Shavasanam : Many benefits with shavasanam... if you know... you will start immediately...!
Shavasanam : శవాసనంతో బోలెడు లాభాలు… తెలిస్తే… వెంటనే మొదలుపెడతారు…!
Shavasanam : మనం యోగాసనాలు చేయడం వలన శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ఆరోగ్యంగా ఉండడానికి మరియు రోగాలు రాకుండా ఉండడానికి నిత్యం యోగ చేయాలి అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఈ ఆసనాలలో ఒకటి శవాసనం. ఈ శవాసనాన్ని అన్ని ఆసనాలు చేసిన తరువాత చివరిలో చేస్తారు. కానీ ఈ ఆసనం చేయడం వలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ శవాసనాన్ని ఐదు నిమిషాల పాటు చేయడం వలన శరీరం ఎంతో రిలాక్స్ గా ఉంటుంది. ఈ ఆసనం అలసటను పోగొట్టి శారీరక మరియు మానసిక ఉల్లాసం పొందడంలో కూడా మేలు చేస్తుంది. ఈ శవాసనం చేయడం వలన లాభాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…
యోగాసనాలలో శవాసనం చేయటం ఎంతో ఈజీ. ఇది ఎంతో మందికి ఇష్టమైన ఆసనం అని కూడా చెప్పవచ్చు. ఎందుకు అంటే. ఈ ఆసనం వేయడానికి శరీరాన్ని వంచాల్సిన అవసరం కూడా ఉండదు. దీనికి శవం లా పడుకుంటే సరిపోతుంది. మీరు శవాసనం చేస్తున్నప్పుడు పడుకొని మొత్తం శరీరాన్ని కూడా రిలాక్స్ చేయాలి. మీరు మీ కళ్ళు మూసుకొని ఈ ఆసనం చేసేటప్పుడు మనసు, శరీరంలోని ప్రతి భాగాన్ని కూడా ఎంతో విశ్రాంతి తీసుకునివ్వాలి. దీనివలన రక్తపోటు అనేది తగ్గుతుంది. అంతేకాక ఉద్రిక్తత స్థాయి కూడా తక్కువ గా ఉంటుంది.
ఈ శవాసనాన్ని శాంతి ఆసనం మరియు అమృత ఆసనం అని కూడా అంటారు. అయితే ఎన్నో శతాబ్దాలుగా మెదడులోని శక్తిని ఉత్తేజితం చేయడానికి చాలామంది యోగ గురువులు చెబుతున్న మరియు చేస్తున్న ఆసనం కూడా ఇదే. ముఖ్యంగా ఇది మెదడుపై ఒత్తిడి తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది. అలాగే మెదడు పనితీరును కూడా ఎంతో బాగా మెరుగుపరుస్తుంది. అలాగే శవాసన చేయడం వలన నిద్రలేమికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మీరు రాత్రి పూట ప్రశాంతమైన నిద్ర పోవాలి అంటే ఈ యోగ భ్యాసం చేయడం అలవాటు చేసుకోవాలి అని అంటున్నారు నిపుణులు.
శవాసనం చేయడం వలన శరీరంలో కదలికలను నియంత్రిస్తూ శవం మాదిరిగా నిశ్చలంగా ఉండడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇలా చేస్తే నే శ్వాస మీద ధ్యాస ఉంచటం సాధ్యం అవుతుంది. అలాగే శారీరకంగా మరియు మానసికంగా కూడా ఎంతో విశ్రాంతి అనేది దొరుకుతుంది. అలాగే శరీరం ఈ స్థితిలో ఉన్నప్పుడు కార్డిసాల్ స్థాయిలు అనేవి తగ్గుతాయి. దీనివలన గుండె రేటు మరియు రక్త పోటు కూడా తగ్గుతుంది.
అలాగే వ్యాయామం మరియు వాకింగ్, యోగ చేసిన తర్వాత శవాసనం ద్వారా శరీరానికి ఎంతో విశ్రాంతితో పాటు శవాసనాలలో ధ్యానం చేయడం వలన వ్యాయామం తరువాత శరీర అవయవాలు అనేవి ఎంతో సక్రమంగా పనిచేస్తాయి. ఇలా చేయడం వలన రక్తపోటు అనేది కూడా తగ్గుతుంది. ఇది రోగనిరోధక శక్తిని ఎంతగానో పెంచుతుంది. అలాగే ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది. ఈ శవాసనం నిత్యం ఖచ్చితంగా చేస్తుండడం వలన మెదడు నిర్మాణంలో మార్పులు అనేవి కలుగుతాయి.
అలాగే కొత్త కొత్త విషయాలను నేర్చుకోవడానికి కావలసిన ఏకాగ్రతతో పాటుగా జ్ఞాపకశక్తి కూడా ఎంతో పెరుగుతుంది. అలాగే నిత్యం ఈ ఆసనాన్ని అలవాటు చేసుకునే వారు కొంత కాలం తర్వాత క్రియేటివ్ గా మరియు రిలాక్స్ డ్ గా ఉండగలుగుతారు అని పరిశోధనలో కూడా తేలింది. అంతేకాక ఈ ఆసనంతో కలిగే మరొక లాభం ఏమిటి అంటే. ఒత్తిడి లేకుండా పనిచేయటం వలన చక్కగా నిద్ర అనేది పోగలుగుతాం…
COMMENTS