New rules from September - 6 things that change from Aadhaar card to cylinder prices!
సెప్టెంబర్ నుంచి కొత్త రూల్స్- ఆధార్ కార్డ్ నుంచి సిలిండర్ ధరల వరకు మారే 6 అంశాలివే!
September New Rules : ఆగస్టు నెల చివరకు వచ్చేశాం. ఇంకొన్ని రోజుల్లో సెప్టెంబర్ నెల ప్రారంభం కానుంది. కొత్త నెలలో ప్రజల ఆర్థిక పరిస్థితిపై నేరుగా ప్రభావితం చేసేలా కొత్త రూల్స్ రానున్నాయి. అందుకు సంబంధించిన మార్పులు సెప్టెంబర్ 1 నుంచి అమలు కానున్నాయి. ఎల్పీజీ సిలిండర్ ధర నుంచి ఆధార్ కార్డ్ అప్డేట్ వరకు మన వ్యక్తిగత బడ్జెట్‌పై ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం.
1.ఎల్పీజీ సిలిండర్ ధరలు:
ప్రభుత్వం ప్రతి నెలా ఎల్పీజీ ధరలను సాధారణంగానే సవరిస్తుంది. ఈ మార్పుల వల్ల గృహ, వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరలపై ప్రభావం చూపుతాయి. ఆగస్టులో వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ ధర రూ.8.50 పెరిగింది. అదే జూలైలో రూ.30 మేర తగ్గింది. మరోసారి సెప్టెంబర్‌లో కూడా ఎల్పీజీ సిలిండర్ల ధరలను సవరించే అవకాశాలున్నాయి.
2. ATF, CNG,PNG ధర మార్పులు:
ఎల్పీజీ సిలిండర్ ధరలతో పాటు చమురు మార్కెట్ కంపెనీ ప్రతి నెలా ఎయిర్ టర్బైన్ ఇంధనం( ఏటీఎఫ్), సీఎన్జీ, పీఎన్జీ ధరలను సవరిస్తుంటాయి. సెప్టెంబర్ ఒకటో తేదీన కూడా ఇంధన ధరల్లో మార్పులు ఉండొచ్చు.
3. ఫేక్ కాల్స్‌పై కొత్త రూల్స్:
మోసపూరిత కాల్స్, సందేశాలు పంపే టెలిమార్కెటర్లపై, టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కఠినమైన నిబంధనలు విధించింది. వినియోగదారులను మోసపూరిత కాల్స్, మెసేజ్‌లను అరికట్టాలని జియో, ఎయిర్టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ కంపెనీలకు ఆదేశించింది. 140 సిరీస్‌తో ప్రారంభమయ్యే నంబర్లు టెలిమార్కెటింగ్ కాల్స్, వాణిజ్య సందేశాలను చేయడం సెప్టెంబర్ 30 నాటికి మానేయాలి మార్గదర్శకాలను జారీ చేసింది.
4. క్రెడిట్ కార్డ్ నియమాలు:
క్రెడిట్ కార్డు యూజర్లకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త మార్పులు అమలులోకి రానున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా చేసిన విద్యాపరమైన చెల్లింపులకు వచ్చే రివార్డ్ పాయింట్స్‌ను తొలగించింది. యుటిలిటీ లావాదేవీలపై పొందే రివార్డ్ పాయింట్లపై సెప్టెంబర్ 1 నుంచి పరిమితి విధించింది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ తన క్రెడిట్ కార్డు బిల్లుల మొత్తంపై చెల్లించే మినిమమ్ బ్యాలెన్స్‌ను తగ్గించనుంది. అలాగే చెల్లింపు గడువు కూడా 18 రోజుల నుంచి 15 రోజులు తగ్గించింది. యూపీఐ పేమెంట్స్‌ను రూపే క్రెడిట్ కార్డ్‌ల ద్వారా వినియోగదారులు ఇతర సర్వీస్ ప్రొవైడర్ల మాదిరిగానే రివార్డ్ పాయింట్స్ పొందొచ్చు.
5. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ):
సెప్టెంబర్‌లో డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు డీఏను 3 శాతం మేర పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 53 శాతనికి పెరగనుంది.
6. ఉచిత ఆధార్ అప్డేట్:
ఆధార్ కార్డ్ ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి గడువు సెప్టెంబర్ 14 వరకే ఉంది. ఆ తర్వాత ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవాలంటే రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. ఉచిత ఆధార్ అప్‌డేట్‌ల కోసం గతంలో జూన్ 14 వరకే గడువు విధించగా, దానిని సెప్టెంబర్ 14వరకు పొడిగించారు.
COMMENTS