Release of LRS Rules - Cut off date for applications.
RBI guidelines for outward remittance LRS application status LRS Scheme RBI Circular What is the last date for LRS in Telangana 2024? What are the new rules for LRS? What is the period for surrender of realised foreign exchange? What is the current limit of LRS? RBI guidelines for foreign exchange transactions Foreign inward remittance RBI guidelines FEMA guidelines for outward remittance Forgot LRS application number Form A2 RBI guidelines.
LRS నియమ నిబంధనలు విడుదల - దరఖాస్తుల కటాఫ్ తేదీ ఇదే.
LRS RULES AND REGULATIONS : బీఆర్ఎస్ హయాంలో 2020లో జారీ చేసిన జీవో 131, జీవో 135 ప్రకారం రాష్ట్రంలో అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రస్తుత ప్రభుత్వం తాజాగా నియమ నిబంధనలు జారీ చేసింది. 2020 ఆగస్టు 26 కంటే ముందు రిజిస్ట్రర్ చేసిన లేఅవుట్లకు మాత్రమే ఎల్‌ఆర్‌ఎస్ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 2020 అక్టోబర్ 15వ తేదీలోపు స్వీకరించిన దరఖాస్తులనూ పరిగణనలోకి తీసుకుంటామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు.
నియమ నిబంధనలు 2020లో విడుదల చేసినప్పటికీ, ఈ ఏడాది జనవరిలో దరఖాస్తుల పరిశీలన మొదలైందని తెలిపారు. ఇప్పటి వరకు 4,28,832 దరఖాస్తులు ప్రాసెస్ చేసినట్టు చెప్పారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు 60,213 దరఖాస్తులు ఆమోదం పొందగా, రూ.96.60 కోట్లు వసూలైనట్టు వివరించారు. దాదాపు 75 శాతం దరఖాస్తులకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించలేదన్నారు.
మళ్లీ అవకాశం :
తగిన డాక్యుమెంట్లు సమర్పించని దరఖాస్తుదారులకు ఇప్పటికే తెలియజేశామని పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. వాటిని అప్‌లోడ్ చేయడం కుదరకపోగా, సకాలంలో ప్రాసెస్ చేయలేకపోతున్నట్లు తెలిపారు. డాక్యుమెంట్లు అందజేసేందుకు దరఖాస్తుదారులకు అవకాశం కల్పించామని, సేల్ డీడ్, ఈసీ, మార్కెట్ విలువ సర్టిఫికెట్, లేఅవుట్ కాపీలను అప్‌లోడ్ చేయవచ్చని పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు.
సందేహాల నివృత్తి :
దరఖాస్తుదారులు తమ మొబైల్ నంబర్, చిరునామా, ఇతర వివరాలను మొబైల్ నెంబర్ ఓటీపీ ఉపయోగించుకుని సవరించుకోవచ్చన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగరాభివృద్ధి సంస్థలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులకు సందేహాలుంటే, హెల్ప్ డెస్క్‌లను సందర్శించి నివృత్తి చేసుకోవాలని సూచించారు.
తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబరు 31 వరకు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను స్వీకరించింది. మొత్తం 25.70 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో హెచ్‌ఎండీఏ పరిధిలో 3.58 లక్షలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో 1.06 లక్షలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో 13.69 లక్షలు, గ్రామ పంచాయతీల్లో 6 లక్షలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో 1.35 లక్షల లెక్కన ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి.
COMMENTS