RBI quiz: Golden opportunity for college students; Rs. A chance to win up to 10 lakhs.
RBI quiz: కాలేజీ స్టుడెంట్స్ కు సువర్ణావకాశం; రూ. 10 లక్షల వరకు గెలుచుకునే ఛాన్స్.
RBI quiz: 90 ఏళ్లు పూర్తి చేసుకున్న భారతీయ రిజర్వు బ్యాంకు.. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘ఆర్‌బీఐ 90 క్విజ్’ పేరుతో క్విజ్ పోటీలను నిర్వహిస్తోంది. 25 ఏళ్ల లోపు వయస్సు ఉన్న కాలేజీ విద్యార్థులు ఈ క్విజ్ పోటీల్లో పాల్గొనవచ్చు. ఇందులో పాల్గొనడానికి ఎలాంటి రిజిస్ట్రేషన్ రుసుము ఉండదు.
సెప్టెంబర్ 17 వరకు..
కాలేజీ విద్యార్థులు ఈ ఆర్‌బీఐ 90 క్విజ్ పోటీల్లో పాల్గొనడానికి సెప్టెంబర్ 17 వరకు నమోదు చేసుకోవచ్చు. ఈ పోటీలో విజయం సాధించిన విద్యార్థులు రూ. 1 లక్ష నుంచి రూ. 10 లక్షల వరకు బహుమతి గెలుచుకోవచ్చు. ఇది దేశవ్యాప్తంగా ఆన్ లైన్ లో నిర్వహించే క్విజ్ కాంపిటీషన్. ఈ పోటీ కోసం ఆన్‌లైన్‌లో ఆడిషన్స్ నిర్వహిస్తారు. అనంతరం వివిధ దశల్లో రాష్ట్ర చాంపియన్‌ను ఎంపిక చేస్తారు. వారు ఆ తర్వాత జాతీయ స్థాయిలో పోటీ పడాల్సి ఉంటుంది. అక్కడ గెలిచిన వారికి రూ. 10 లక్షల బహుమతి నగదు అందిస్తారు.
క్విజ్ లక్ష్యాలివే..
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ నెల 20న ఈ క్విజ్ వివరాలను వెల్లడిస్తూ, విద్యార్థుల నుంచి ఎంట్రీలు ఆహ్వానించారు. ఆర్థిక ప్రపంచంలో విద్యార్థులు తమ జ్ఞానాన్ని నిరూపించు కోవడం, ఆర్థిక సమస్యలపై విద్యార్థులకు అవగాహన పెంచడం, డిజిటల్ ఫైనాన్స్‌ను సురక్షితంగా, బాధ్యాయుతంగా వినియోగించడంపై వారిని ప్రోత్సహించడం ఈ క్విజ్ ఉద్దేశమని శక్తికాంత దాస్ తెలిపారు.
ఎవరికి ఎంత బహుమతి..?
జాతీయ స్థాయి విజేతకు రూ. 10 లక్షలు ప్రథమ బహుమతిగా లభిస్తాయి. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా రూ. 8 లక్షలు, రూ. 6 లక్షలు అందిస్తారు. జోనల్ స్థాయిలో తొలి ముగ్గురు విజేతలకు రూ. 5 లక్షలు, రూ. 4 లక్షలు, రూ. 3 లక్షలు అందిస్తారు. రాష్ట్ర స్థాయిలో ఈ బహుమతి వరుసగా రూ. రూ. 2 లక్షలు, రూ. 1.5 లక్షలు, రూ. 1 లక్షగా ఉంటుంది..
ఎలా పాల్గొనాలి..?
25 ఏళ్ల (1 సెప్టెంబర్ 1999 తర్వాత జన్మించిన వారు) లోపు వయస్సున్న వారు ఈ క్విజ్‌లో పాల్గొనవచ్చు. ఇందులో పాల్గొనేందుకు ఎలాంటి ఎంట్రీ ఫీజు చెల్లించాల్సిన పని లేదు. కాకపోతే, దేశంలో ఎక్కడైనా సరే కాలేజీలో చదువుతూ ఉండాలి. ఈ క్విజ్ పోటీలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు సెప్టెంబర్ 17 వరకు ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఈ టాపిక్స్ ను నేర్చుకోండి..
ఆర్బీఐ 90వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించనున్న ఈ క్విజ్ లో ప్రధానంగా దేశ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాలపై, ఆర్బీఐ (RBI) పై, డిజిటల్ కరెన్సీపై, ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ను బేస్ చేసుకుని ప్రశ్నలుంటాయి. అలాగే, కరెంట్ అఫైర్స్, చరిత్ర, సాహిత్యం, క్రీడలు, ఆర్థికం, జనరల్ నాలెడ్జ్ వంటి వాటిపై ప్రశ్నలు ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలుంటాయి
COMMENTS