Putting a cell phone in pants pocket is Dangerous.
Where should a man carry his cell phone Can keeping your phone in your pocket cause cancer Does having your phone in your pocket reduce sperm count Is it safe to keep a phone in a pant pocket? Is it dangerous to carry a cell phone in your pocket? Is putting your phone in your pocket bad for men? Is it safe to carry cell phone in shirt pocket Phone in pocket radiation Cell phone in pocket hip pain What pocket should I put my phone in Why you should never keep your phone in your pocket
ప్యాంటు జేబులో సెల్‌ఫోన్ పెట్టుకుంటున్నారా.. అయితే ఇది కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!
Cell Phone Blast in Pant Pocket: ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గరా స్మార్ట్ ఫోన్ ఉంటోంది. కూలీ పని చేసుకునే వ్యక్తి నుంచి పెద్ద పెద్ద కంపెనీ సీఈవోల దగ్గర కామన్‌గా ఉంటుంది ఈ సెల్‌ఫోనే అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతేందుకు స్కూల్‌కు వెళ్లే విద్యార్థుల దగ్గర కూడా మొబైల్ ఫోన్లు ఉంటున్నాయి. అరచేతిలోనే ప్రపంచాన్ని చూపించే.. ఈ సెల్‌ఫోన్ల వాడకం రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే.. బ్రాండెడ్ ఫోన్లతో పాటు తక్కువ ధరకే నాసిరకం మొబైల్స్ కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉంటున్నాయి. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు వస్తున్నాయని కొన్నామో.. జేబుల్లో మొబైల్ బాంబులు పెట్టుకున్నట్టే. అచ్చంగా అలాంటి ఘటనే.. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో జరిగింది.
పిట్లం ఎస్సీ కాలనీకి చెందిన ప్రైవేట్ మెడికల్ ప్రాక్టిషనర్ ఎనిగే సాయిలు.. రోజు మాదిరిగానే గురువారం రోజు (ఆగస్టు 15న) కూడా తన క్లినిక్‌కు వెళ్లాడు. చాలా మందిలాగే.. సాయిలు కూడా తన మొబైల్ ఫోన్‌ను ప్యాంటు జేబులో పెట్టుకోవటం అలవాటు. అయితే.. తన ప్యాంటు జేబు భాగంలో ఏదో వేడిగా అనిపించింది. సెల్‌ఫోన్ హీట్ అవుతుందేమో అని గమనించి.. బయటకు తీద్దామనుకునేలోపే.. జేబులోనే మొబైల్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో మొబైల్ పూర్తిగా ధ్వంసం కాగా.. జేబు కూడా కాలిపోయింది.
ఊహించన ఘటనతో సాయిలుకు వణుకు పట్టుకుంది. అయితే.. సాయిలుకు మాత్రం ఎలాంటి గాయాలు కాకపోవటం ఊపిరి పీల్చుకునే అంశం. అయితే.. సాయిలు వేసుకున్నది వదులుగా ఉన్న ప్యాంటే కావటంతో.. ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో.. పెద్ద ప్రమాదమే తప్పిందని ఊపిరి పీల్చుకున్నాడు. ఈ విషయం పక్కనున్న వాళ్లకు తెలియటంతో.. ఈ ఘటనపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఒకవేళ జీన్ ప్యాంటు వేసుకుని ఉంటే.. గాయాలు అయ్యేవని అభిప్రాయపడుతున్నారు.
సెల్‌ఫోన్లలో కూడా నాసిరకం వస్తున్నాయని.. కెపాసిటీకి సరిపోయే బ్యాటరీలు ఇవ్వకపోవటం.. ఛార్జింగ్ అడాప్టర్లు కూడా తగినవి వాడకపోవటంతో.. మొబైళ్లు హీటెక్కిపోతున్నాయి. దీంతో.. ఛార్జింగ్ పెట్టినప్పుడో లేదా.. బాగా వాడినప్పుడే వేడెక్కి.. పేలిపోతున్నాయి. కొన్నిసార్లు చేతుల్లో పేలి.. తీవ్ర గాయాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవలే.. ఓ చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన చోటుచేసుకుంది.
ఇలాంటి ఘటనలు దృష్టిలో పెట్టుకుని.. మొబైల్ వినియోగదారులు కొనేటప్పుడు గానీ, కొన్న తర్వాతా వాటిని వాడే సమయంలో గానీ కొంచెం అప్రమత్తంగా ఉండాలి. సెల్ ఫోన్ హీటెక్కుతుందని గుర్తించిన వెంటనే రిపేర్ చేపించటమో.. లేదా దాన్ని మార్చేసి కొత్త ఫోన్ తీసుకోవటమో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
COMMENTS