New Voter Registration : Another chance for voter registration! You can apply with this link
New Voter Registration : ఓటరు నమోదుకు మరో ఛాన్స్..! ఈ లింక్ తో దరఖాస్తు చేసుకోవచ్చు
New Voter Registration : కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా కొత్తగా కూడా ఓటర్ నమోదు చేసుకోవచ్చు. ఇదే సమయంలో తప్పొప్పులను ఎడిట్ చేసుకునే వీలుంటుంది. https://voters.eci.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు.
కొత్తగా ఓటరు నమోదు చేసుకోవటంతో పాటు తప్పు ఒప్పులను సవరించుకునేందుకు ఎన్నికల సంఘం మరో అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టింది.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో తెలంగాణలో కూడా ఓటర్ల జాబితా సవరణ ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమైంది. వచ్చే ఏడాది జనవరి 1 వరకు 18 ఏళ్లు పూర్తయ్యే వారు ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవచ్చు.
దరఖాస్తుల స్వీకరణ గడువు అక్టోబర్ 18వ తేదీతో పూర్తి అవుతుంది ఓటర్ల జాబితా ముసాయిదాను అక్టోబర్ 29వ తేదీన విడుదల చేస్తారు. ఇందులో మార్పులు, చేర్పులతో పాటు అభ్యంతరాలను నవంబరు 28 వరకు స్వీకరిస్తారు.
జనవరి 6న తుది ఓటర్ల జాబితాను ఈసీ ప్రకటించనుంది. కొత్తగా ఓటరు నమోదుతో పాటు మార్పులు, చేర్పుల ప్రక్రియ కోసం https://voters.eci.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
- ఫారమ్ 6తో కొత్తగా ఓటర్ల జాబితాలో పేరు చేర్చేందుకు దరఖాస్తు చేసుకోవాలి.
- ఫారం 7తో ఓటరు జాబితాలో పేరు చేర్చేందుకు సంబంధించి అభ్యంతరం తెలపటానికి... జాబితాలోంచి పేరు తొలగించడానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- ఫారమ్ 8తో ఓటరు జాబితాలో సవరణలకు దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఫారం 8ఎతో ఓటరు జాబితాలో పేరును మరో చోటికి బదిలీ చేయటానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
COMMENTS