Mobile Tower: Do you know how much you will get every month if you put a tower on the terrace of your house?
Mobile Tower : ఇంటి టెర్రస్ పై టవర్ వేస్తే ప్రతి నెల ఎంత వస్తుందో తెలుసా.. అన్ని వేలు వస్తాయా..?
Mobile Tower : ఖాళీగా ఉన్న టెర్రస్ ని ఉపయోగించి చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు. అదెలా అనుకోవచు ఇంటి టెర్రస్ మీద టవర్ వేసేందుకు అనుమతి ఇస్తే దాదాపు 60 వేల రూపాయల దాకా సంపాదించే ఛాన్స్ ఉంటుంది. టెర్రస్ నుంచి ఇంత ఆధాయం ఎలా వస్తుందో తెలుసుకోండి. చదువు, ఉద్యోగం అన్నది మన చేతుల్లో ఉన్నా సరైన టైం కు జాబ్ వస్తుందని గ్యారెంటీ లేదు. ఐతే ఎంత ఉద్యోగం చేసినా సరే అదనపు ఆదాయం లేనిదే కష్టం అవుతుంది. అందుకే రకరకాల ఆదాయ మార్గాలను ఎంపిక చేసుకుంటున్నారు.
మీ ఇంటి డాబా తో నెలకు 60000 దాకా సులభంగా సంపాదించే ఛాన్స్ ఉంది. డబ్బు సంపాదించడానికి ఇది సులభమైన మార్గమని చెప్పొచ్చు. ఇంటి టెర్రస్‌పై మొబైల్ నెట్‌వర్క్ టవర్‌ను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా భారీ మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం ఉంది. టెలికాం కంపెనీలు ప్రజలకు మంచి నెట్ వర్క్ సేవలు అందించే క్రమంలో ఎన్ని వీలైతే అన్ని ఎక్కువ టవర్లను ఏర్పాటు చేయాలని చూస్తుంది. అందుకే ఎక్కడ పడితే అక్కడ టవర్ లను ఏర్పాటు చేస్తుంది. ఇంటి టెర్రస్ మీద కూడా మొబైల్ నెట్ వర్క్ టవర్ ఇన్ స్టాల్ చేయొచ్చు. ఇంటి టెర్రస్ మీద 500 షీట్ల స్థలం ఉంటే చాలు మొబైల్ టవర్ ఇన్ స్టాల్ చేయొచ్చు.
మొబైల్ టవర్ కోసం కంపెనీ మిమ్మల్ని సంప్రదించదు. మీరే సంబదిత కంపెనీ ఏజెంట్లను సంప్రదించాలి. లేదా ఆన్ లైన్ లో వారిని కాంటాక్ట్ అవ్వాలి. అలా కాంటాక్ట్ అయితే వారు వచ్చి మీ ఇంటి టెర్రస్ తనిఖీ చేసి స్థలం ఓకే అనుకుంటే టవర్ ఏర్పాటు చేస్తారు. టవర్ పెట్టిన దగ్గర నుంచి నెలకు 10 వేల నుంచి 50 వేల దాకా అద్దె చెల్లిస్తారు. సో ఎలాంటి వ్యయ ప్రయాసలు లేకుండా టవర్ ఏర్పాటు చేయడం ద్వారా అద్దె రూపంలో పెద్ద మొత్తాన్ని పొందవచ్చు.
COMMENTS