Kotak Kanya Scholarship 2024: If Inter passed Rs. 1.5 Lakh Scholarship- Who is Eligible? How to apply?
Kotak Kanya Scholarship 2024: ఇంటర్ పాసైతే ఏడాదికి రూ. 1.5 లక్షల స్కాలర్‌షిప్- ఎవరు అర్హులు? ఎలా అప్లై చేయాలి?
Kotak Kanya Scholarship 2024 Details: దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన పేద బాలికల ఉన్నత విద్య కోసం "కోటక్ కన్య స్కాలర్‌షిప్"ను అందిస్తోంది కోటక్ మహీ. ఈ స్కాలర్‌షిప్ కింద ప్రతి బాలికకు ఏడాదికి రూ.1.5లక్షల ఆర్థిక సహాయం అందిచనుంది. ఈ స్కాలర్‌షిప్‌ను విద్యార్థిని.. తన కోర్సు పూర్తి చేసే వరకు ఇస్తారు. బాలికలను ఉన్నత విద్యవైపు ప్రోత్సహించే విధంగా ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ మొత్తాన్ని బాలికలు.. ల్యాప్‌టాప్ లేదా తమ హాస్టల్, ట్యూషన్, ఇతర ఖర్చుల కోసం వినియోగించుకోవచ్చని వివరించింది. అయితే, ఈ స్కాలర్‌షిప్‌ను కేవలం ఇంటర్ పూర్తి చేసిన వారికి మాత్రమే అందజేస్తారు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
స్కాలర్‌షిప్‌నకు ఎవరు అర్హులు?
దేశవ్యాప్తంగా ఉన్న బాలికలు అందరూ అర్హులు.
ఇంటర్‌లో 75శాతానికి మించి మార్కులు సాధించి ఉండాలి.
బాలిక కుటుంబ వార్షికాదాయం రూ. 6 లక్షల లోపు ఉండాలి.
దేశంలోని NIRF/NAAC సంస్థలతో గుర్తింపు పొందిన ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్, MBBS, BDS, ఇంటిగ్రేటెడ్ LLB (5 సంవత్సరాలు), B.ఫార్మసీ, B.Sc వంటి ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అభ్యసిస్తున్న మొదటి ఏడాది మహిళా విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
కోటక్ మహీంద్రా గ్రూప్, కోటక్ ఎడ్యూకేషన్ ఫౌండేషన్, బడ్డీ ఫర్ స్టడీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు ఇందుకు అనర్హులు.
అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 30లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసేందుకు కావాల్సిన పత్రాలు:
- ఇంటర్ మార్క్‌షీట్
- తల్లిదండ్రుల ఆదాయ ధ్రువీకరణ పత్రం
- విద్యార్థిని చదువుతున్న కోర్సు ఫీజు వివరాలు
- బోనఫైడ్ సర్టిఫికెట్
- కాలేజీ సీట్ అలాట్మెంట్ లెటర్
- ప్రవేశ పరీక్ష స్కోర్ కార్డ్
- ఆధార్ కార్డ్
- బ్యాంక్ పాస్‌బుక్
- పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో
- వైకల్యం ఉంటే సర్టిఫికెట్
- డెత్ సర్టిఫికెట్(తల్లి లేదా తండ్రి మరణిస్తే)
- ఇంటి ఫొటోలు
దరఖాస్తు విధానం:
- ఈ స్కాలర్‌షిప్‌నకు అప్లై చేయాలనుకునే బాలికలు ఈ https://www.buddy4study.com/page/kotak-kanya-scholarship#scholarships లింక్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత Buddy4Study పేజ్‌లో మీ వివరాలు ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
- లాగిన్ అయ్యాక ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ పేజీ కనిపిస్తుంది.
- వెంటనే Kotak Kanya Scholarship 2024-25 కు సంబంధించిన పేజీకి వెళ్తుంది.
- అక్కడ స్టార్ట్ అప్లికేషన్ బటన్‌పై క్లిక్ చేసి అవసరమైన వివరాలు ఎంటర్ చేయాలి.
- అనంతరం పత్రాలను అప్లోడ్ చేసి కింద ఉన్న నియమనిబంధనలు(టర్మ్స్ అండ్ కండీషన్స్) అంగీకరించాలి.
- ఆ తర్వాత ప్రివ్యూపై క్లిక్ చేసి వివరాలన్ని సరిగ్గా ఉన్నాయే లేదో చెక్ చేసుకుని సబ్మిట్ కొట్టాలి.
COMMENTS