Income Tax Refund Status Check
మీకు ఐటీ రిఫండ్ ఇంకా రాలేదా? - పాన్ నంబర్‌తో ఇలా చిటికెలో స్టేటస్ తెలుసుకోండి!
How To Check Income Tax Refund Status : గత ఆర్థిక సంవత్సరానికి(2023-24) సంబంధించి ఐటీఆర్(ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌లు) ఫైల్ చేసి.. రిఫండ్ కోసం ఎదురుచూస్తున్నారా? అలాగే.. మీ రిటర్నుల ప్రాసెసింగ్ ఏ స్టేజ్‌లో ఉందని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే, అందుకోసం మీరు ఎక్కువగా శ్రమించాల్సిన పనిలేదని.. మీ దగ్గర పాన్ కార్డు ఉంటే చాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే పాన్ కార్డుతో చిటికెలో మీ ఐటీఆర్ రీఫండ్(ITR Refund) స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చంటున్నారు. అదెలాగంటే..
పాన్ కార్డును ఉపయోగించి ఆన్లైన్లో రెండు మార్గాల ద్వారా ఈజీగా ఐటీ రీఫండ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అందులో ఒకటి.. ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా, మరొకటి.. ఎన్ఎస్డీఎల్ టిన్ వెబ్‌సైట్ ద్వారా సింపుల్‌గా రీఫండ్ స్టేటస్ తెలుసుకోవచ్చు. అయితే, ఐటీ రీఫండ్ స్టేటస్ తెలుసుకోవడానికి ముందు మీకు ఈ విషయాలు తప్పనిసరిగా తెలిసుండాలి. ముఖ్యంగా ఇన్‌కమ్ ట్యాక్స్ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అయ్యేందుకు వాలిడ్ ఐడీ, పాస్‌వర్డ్ కలిగి ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా మీ పాన్ కార్డు కచ్చితంగా ఆధార్‌తో లింక్ అయ్యి ఉండాలి. అలాగే మీ ఐటీఆర్ ఫైలింగ్ అక్‌నాలెడ్డ్‌మెంట్ నంబర్ అవసరమవుతుందనే విషయాన్ని గమనించాలి.
ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఐటీ రీఫండ్ స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా:
ఇందుకోసం మీరు ముందుగా ఆదాయ పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌ని https://www.incometax.gov.in/iec/foportal/ సందర్శించాలి.
అనంతరం Login బటన్‌పై క్లిక్ చేసి.. మీ యూజర్ ఐడీ (పాన్ కార్డు నంబర్), పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
తర్వాత స్క్రీన్ మీద మీ వివరాలు కనిపిస్తాయి. అందులో e- File ఆప్షన్‌పై క్లిక్ చేసి అందులో Income Tax Returns ఆప్షన్లో View Filed Returns పై క్లిక్ చేయాలి.
అనంతరం మీ ఐటీఆర్‌కు సంబంధించిన 'అసెస్మెంట్ ఇయర్'ను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి.
ఇందులో మీ ఐటీఆర్ రీఫండ్ స్టేటస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. అంతే సింపుల్!
ఇందుకోసం ముందుగా మీరు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ వెబ్‌సైట్‌ని https://tin.tin.nsdl.com/oltas/refund-status-pan.html సందర్శించాలి.
ఆ తర్వాత అందులో మీ పాన్ నంబర్ ఎంటర్ చేసి అసెస్మెంట్ ఇయర్ నమోదు చేయాలి.
అనంతరం క్యాప్చా కోడ్ నమోదు చేసి.. ప్రొసీడ్ అనే ఆప్షన్‌పై నొక్కాలి.
అంతే.. మీ రీఫండ్ స్టేటస్‌కు సంబంధించిన వివరాలు డిస్ ప్లేపై కనిపిస్తాయి.
అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే.. మొదట ఐటీఆర్ వెరిఫికేషన్ పూర్తి అయ్యాకే రిఫండ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. కాబట్టి.. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి అయితేనే మీకు రావాల్సిన రిఫండ్ మీరు ఇచ్చిన బ్యాంకు ఖాతాలో జమ అవుతుందనే విషయాన్ని గమనించాలి.
COMMENTS