Ration Card : If you have a ration card, Canara Bank offer is for you.. Free training and employment too..!
Ration Card : రేషన్ కార్డ్ ఉందా అయితే కెనరా బ్యాంక్ ఆఫర్ మీకోసమే.. ఉచిత్ర శిక్షన ఇచ్చి ఉపాధి కూడా..!
Ration Card : రేషన్ కార్డ్ ఉంటే చాలు కెనరా బ్యాంక్ నుంచి మంచి ఆఫర్ వచ్చింది. ఈసారి ఉపాధి కోసం కెనరా బ్యాంక్ నుంచి ఆఫర్ ఇచ్చింది. కర్నూలు జిల్లా నిరుద్యోగులకు అందులోనూ 10వ తరగతి పాసైన ఫెయిల్ అయిన గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి అందిస్తుంది కెనరా బ్యాంక్. కెనరా బ్యాంక్ కూళ్లూరు శాఖ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తుంది. కెనరా బాంక్ ఉచిత్ర శిక్షణ ఛాన్స్.. ఇందులో భాగంగా స్మార్ట్ ఫోన్, సెల్‌ఫోన్ రిపేర్‌లో 30 రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఇస్తారు. కెనరా బ్యాంక్ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కార్యాలయ జోనల్ మేనేజర్ పుష్పక్ ఈ విషయాన్ని ప్రకటించారు.
గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సెల్ ఫోన్ రిపేర్‌తో పాటు, కుట్టు మిషన్ ఆపరేషన్, కంప్యూటర్ డేటా ఎంట్రీ వంటి వాటిలో శిక్షణను అందిస్తారు. వీటితో పాటు బైక్ మెకానిక్స్, సోలార్ ప్యానెల్ ఇన్ స్టాలేషన్, సీసీ కెమెరా ఇన్ స్టాలేషన్ లాంటి వాటికి కూడా ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఈ ప్రోగ్రాం లో శిక్షణ మాత్రమే కాకుండా 30 నుంచి 45 రోజుల పాటు ఉచిత్ర వసతి భోజనం కూడా అందిస్తారు.రేషన్ కార్డుదారులకు ప్రత్యేక ఆఫర్.. తెల్ల రేషన్ కార్డ్ వారికి కెనరా బ్యాంక్ సెల్ ఫోన్ రిపేర్ లో 30 రోజ్ల శిక్షణ.. వార్కి కూడా హాస్టల్ వసతి భోజనం అందిస్తారు. ఈ నెల 22న తేదీ నుంచి శిక్షణ ప్రారంభం అవుతుంది.
అక్షరాస్య ఉన్నా లేకపోయినా 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయసు ఉన్న వారు ఇందులో పాల్గొన వచ్చు. ఈ ప్రోగ్రాం లో పాల్గొన దలచినవారు.. నిరుద్యోగులు 3 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డ్ జిరాక్స్, విద్యా పత్రాల జిరాక్స్, కర్ణూలు పట్టణంలో కూళ్లూరు రిజిస్టర్ కార్యాలయం దగ్గర్లో ఉన్న కెనరా బ్యాంక్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇంకా సమాచారం కోసం ఆసక్తిగల అభ్యర్ధులు 9000710508 నంబర్ ని సంప్రదించవచ్చు.
COMMENTS