Have a credit card? Do you know about these fees and charges?
Credit Card charges in India Credit card charges SBI Credit card annual charges in India What is a credit card and its charges? What fees do credit cards have? Do you get charged a fee for credit card? RBI guidelines for credit card swipe charges what are a few ways to avoid credit card fees once you have a credit card? How much does a credit card cost per month Credit Card charges HDFC Who pays credit card transaction fees.
మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ ఫీజులు, ఛార్జీలు గురించి మీకు తెలుసా?
Different Types Of Credit Card Charges And Fees : మీరు క్రెడిట్ కార్డును వాడుతున్నారా? అయితే మీకు వచ్చిన క్రెడిట్ కార్డు బిల్లును ఎప్పుడైనా పరిశీలనగా చూశారా? చాలా మంది క్రెడిట్ కార్డు బిల్లును సరిగా చూడకుండానే వాటిని చెల్లిస్తుంటారు. కానీ ఇది ఏమాత్రం మంచిది కాదు. మీ క్రెడిట్ కార్డుపై విధించే వివిధ రుసుములు, ఛార్జీల గురించి కచ్చితంగా మీకు అవగాహన ఉండాలి. ఎందుకంటే, క్రెడిట్ కార్డు వినియోగదారులు కేవలం అది అందిస్తున్న సౌలభ్యాల గురించి మాత్రమే ఆలోచిస్తే సరిపోదు. మీ దగ్గర్నుంచి బ్యాంకు వసూలు చేస్తున్న ఛార్జీలను, రుసుములను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అప్పుడే నష్టపోకుండా ఉండగలుగుతారు. అందుకే వీటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
చాలా క్రెడిట్ కార్డులకు ప్రవేశ రుసుము ఉంటుంది. మొదటి ఏడాది లేదా జీవిత కాలం ఉచితం అని చెప్పినప్పటికీ, అందులో సగమే వాస్తవం ఉంటుంది. చాలా క్రెడిట్ కార్డుల పునరుద్ధరణ సమయంలో, బ్యాంకులు కొంత రుసుమును వసూలు చేస్తాయి. ఏడాదికి నిర్ణీత మొత్తం మేర కొనుగోళ్లు లేదా లావాదేవీలు నిర్వహించినప్పుడే కార్డు వార్షిక రుసుము రద్దవుతుంది.
క్రెడిట్ కార్డ్ బకాయిలు ఆలస్యంగా చెల్లిస్తే, కంపెనీలు మీ నుంచి అధికంగా ఛార్జీలు వసూలు చేస్తాయి. కొన్ని బ్యాంకులు బాకీ ఉన్న మొత్తాన్ని బట్టి, ఈ రుసుములను వసూలు చేస్తుంటాయి. కనుక గడువు తేదీలోపు కనీస మొత్తమైనా చెల్లించడం మంచిది.
ప్రస్తుతం చాలా బ్యాంకులు రూ.50వేలకు మించి బాకీ ఉన్నప్పుడు, ఆలస్య రుసుము కింద కనీసం రూ.1,200 వరకు వసూలు చేస్తున్నాయి. రూ.25,001-రూ.50,000 వరకు ఉన్న బాకీలపై రూ.1,000 అపరాధ రుసుమును తీసుకుంటున్నాయి.
ఒక వేళ మీరు పూర్తి బాకీని చెల్లించకపోతే, కార్డు జారీ చేసిన సంస్థలు మిగిలిన మొత్తంపై వడ్డీని వసూలు చేస్తాయి. ఇవి నెలకు 1.99 శాతం నుంచి 3.75 శాతం (ఏడాదికి 23.88% నుంచి 45%) వరకు ఉంటాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, బ్యాంకులను బట్టి ఈ శాతాలు మారుతుంటాయి. కనుక మీకు క్రెడిట్ కార్డు జారీ చేసిన బ్యాంకు ఎంత రుసుము విధిస్తుందో ముందుగా తెలుసుకోండి.
క్రెడిట్ కార్డు ద్వారా నగదు తీసుకున్నప్పుడు కచ్చితంగా అడ్వాన్స్ ఛార్జీలు వర్తిస్తాయి. కొన్ని బ్యాంకులు నగదుపై నెలకు 2.5 శాతం వడ్డీ వసూలు చేస్తాయి. లేదా రూ.500 వరకు ఫీజు తీసుకుంటాయి. పైగా వీటిలో ఏది ఎక్కువైతే అది మాత్రమే వసూలు చేస్తాయి. కనుక సాధ్యమైనంత వరకు క్రెడిట్ కార్డు ఉపయోగించి, ఏటీఎం నుంచి నగదు తీసుకోకపోవడమే మేలు. అత్యవసర పరిస్థితుల్లో, మీకు మరే ఇతర మార్గాలేమీ లేనప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగించుకోవాలి.
రివార్డు పాయింట్ల విషయంలో ఒక మతలబు ఉంటుంది. మీరు కనుక రివార్డ్ పాయింట్లు ఉపయోగించి, ఏదైనా కొనుగోలు చేసినప్పుడు బ్యాంకులు 'రిడంప్షన్ రుసుము'లను వసూలు చేస్తుంటాయి.
బ్యాంకులు కో-బ్రాండెడ్ కార్డులను అందిస్తుంటాయి. వీటి ద్వారా నిర్దేశిత వస్తువులను కొనుగోలు చేయవచ్చు. దీని వల్ల రుసుములు కాస్త తగ్గుతాయి. ఉదాహరణకు బ్యాంకులు ఇంధన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని కో-బ్రాండెడ్ కార్డులను ఇస్తుంటాయి. అలాగే పలు బ్రాండ్లతోనూ కలిసి క్రెడిట్ కార్డులను జారీ చేస్తుంటాయి. వీటి ద్వారా ఆ బ్రాండ్ల వస్తువులు తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి వీలవుతుంది.
క్రెడిట్ కార్డు బాకీలను నేరుగా బ్యాంకు నుంచి చెల్లించే ఏర్పాటు (ఆటో-పే) చేసుకోవాలి. కానీ గడువు తేదీకి కనీసం ఒక రోజు ముందుగానైనా మీ బ్యాంక్ అకౌంట్లో తగినంత మొత్తం ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల గడువు తేదీలోపు ఆ మొత్తం అందుబాటులో లేకపోతే, సదరు బ్యాంకులు లేదా సంస్థలు మీపై రూ.450 నుంచి రూ.750 వరకు రుసుములు విధించే ఆస్కారం ఉంటుంది.
మీ క్రెడిట్ కార్డుపై ఉన్న పరిమితికి మించి వినియోగించడం ఎప్పుడూ మంచిది కాదు. ఇలా వాడినప్పుడు కార్డు సంస్థలు ఓవర్‌లిమిట్ రుసుములను కూడా విధిస్తాయి. ఇది సాధారణంగా నెలకు 2.5% వరకు ఉంటుంది.
క్రెడిట్ కార్డులను మీరు ఎలా ఉపయోగిస్తున్నారన్నది కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలి. ప్రతి నెలా క్రెడిట్ కార్డు బిల్లులను పూర్తిగా చూడాలి. మొత్తం బాకీని ఒకేసారి తీర్చేందుకు ప్రయత్నించాలి. దీని వల్ల మీ క్రెడిట్ స్కోరు మెరుగవుతుంది.
COMMENTS