Who is Usha Chilukuri, wife of US Vice President JD Vance? A person from AP?
Usha Chilukuri Vance : అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి ఎవరు? ఏపీకి చెందిన వ్యక్తేనా?
Usha Chilukuri Vance : గత అమెరికా ఎన్నికల సమయంలో ఉపాధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగిన కమలా హారిస్ భారత సంతతికి చెందిన వ్యక్తి కావడంతో వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఈసారి ట్రంప్ రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జెడి వాన్స్ భార్య ఉషా చిలుకూరి వాన్స్ కూడా భారత సంతతికి చెందినవారే కావడంతో అమెరికా ఎన్నికల్లో మళ్లీ భారత్ పేరు మరోసారి వినిపిస్తోంది.
JD వాన్స్ భార్య ఉషా చిలుకూరి USలోని ఒక జాతీయ న్యాయ సంస్థలో న్యాయవాది. జెడి వాన్స్ భార్య ఉషా వాన్స్ పేరు ప్రస్తుతం అమెరికాలో ట్రెండ్ అవుతోంది. ఉషా చిలుకూరి, JD వాన్స్ యేల్ లా స్కూల్‌లో చదువుతున్నప్పుడు 2010లలో మొదటిసారి కలుసుకున్నారు. ఆ సమయంలో డిబేట్ సందర్భంగా ఇద్దరూ మాట్లాడుకున్నారు. కొన్ని రోజులకు వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. ఉషా చిలుకూరి జేడీ వాన్స్‌తో తన వివాహ వేడుకలో పట్టు చీర, దండను ధరించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. వీరిద్దరూ భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.
యునైటెడ్ స్టేట్స్ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఉపాధ్యక్షుడిగా సెనేటర్ JD వాన్స్‌ను ఎంచుకున్నారు. ట్రంప్ గెలిస్తే, జెడి వాన్స్ అమెరికా తదుపరి ఉపాధ్యక్షుడు అవుతారు. నిజానికి మెుదట్లో ట్రంప్ విధానాలను వాన్స్ విమర్శించేవారు. కానీ తర్వాత అతడికి విధేయుడిగా మారాడు. దీంతో ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్‌ను ట్రంప్ ప్రకటించారు.
భారతీయ అమెరికన్ ఉషా చిలుకూరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. తన విజయంలో ఉషా చిలుకూరి కీలక భాగమని జేడీ వాన్స్ చాలాసార్లు చెప్పారు. తకు తెలియని విషయాలను భార్య సులభంగా వివరించగలదని అతను పేర్కొన్నాడు.
జేడీ వాన్స్‌కు సాంకేతికత, ఆర్థిక రంగాల్లో మంచి పట్టు ఉంది. వాన్స్ 2022లో అమెరికా సెనేట్‌గా మెుదటిసారి ఎన్నికయ్యారు. సెనేటర్‌గా పోటీ చేస్తున్నప్పుడు అతడి భార్య ఉషా ప్రచారంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. భర్త విజయంలో కీలక పాత్ర పోషించారు.
COMMENTS