Why do you put ring on the second toe of the foot? This is the secret behind it
Toe Ring: పాదాలకున్న రెండో వేలికే మెట్టెలను పెట్టుకుంటారు ఎందుకు? దీని వెనుక ఉన్న సీక్రెట్ ఇదే.
హిందూమతంలో వివాహిత స్త్రీలు పాదాలకు మెట్టెులు ధరించడం తప్పనిసరి. కానీ ఈ రోజుల్లో మోడ్రన్ గా ఉండటం వల్ల చాలా మంది మహిళలకు ఇష్టం. వారు కుంకుమను పెట్టుకోవడం లేదు, అలాగే కాలికి మెట్టెలు పెట్టుకోవడం కూడా ఇష్టపడటం లేదు. కానీ నుదుటిన కుంకుమ ధరించడం, కాలికి మెట్టెలు పెట్టుకోవడం అనేవి పౌరాణిక నమ్మకాలతో ముడిపడి ఉండటమే కాదు, ఇది సైన్సుపరంగా ఆరోగ్యకరమైనదే. హిందువులే కాదు ముస్లిం మహిళలు కూడా తమ కాళ్లకు వెండి మెట్టెలు ధరిస్తారు.
మెట్టెలు ధరించడం ఎందుకు ముఖ్యం?
వివాహిత స్త్రీలు పాదంలోని బొటనవేలు తరువాత ఉన్న వేలికి మెట్టెలు ధరిస్తారు. దీనికి కారణం శరీర నిర్మాణమే. పాదంలోని రెండో బొటనవేలు నుంచి నాడి నేరుగా గుండె, గర్భాశయానికి అనుసంధానమై ఉంటుంది. ఈ వేలికి మెట్టెను ధరించడం వల్ల స్త్రీల రక్తపోటు సక్రమంగా ఉంటుంది. అదే సమయంలో మహిళల పీరియడ్స్ కూడా క్రమబద్దంగా వస్తాయని సైన్సు చెబుతోంది. దీనివల్ల మహిళల పునరుత్పత్తి అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి.
అంతే కాదు, పురాతన నమ్మకాల ప్రకారం, రెండో బొటనవేలుకి వెండి మెట్టెను ధరించడం వల్ల లైంగిక ప్రక్రియ సమయంలో వచ్చే నొప్పి నుంచి మహిళలకు ఉపశమనం కలుగుతుంది. రెండో బొటనవేలుకు మెట్టెలు ధరించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉండి శక్తి లభిస్తుంది. అలాగే రక్తప్రసరణ కూడా చక్కగా ప్రసరిస్తుంది.
చేతుల్లో ఉన్నట్టే కాళ్లలో కూడా నాడీ కేంద్రాలు ఉంటాయి. ముఖ్యంగా పాదాలకున్న వేళ్లకు ఈ నాడీ కేంద్రాలు అనుసంధానించి ఉంటాయి. పాదాలు నేల మీద పెట్టినప్పుడు వేలిలోని కొంత భాగం నేలకి తాకదు. ఆ భాగంలోనే నాడీ కేంద్రాలుంటాయి. మెట్టెలు కాలివేలికే మెట్టెలు పెట్టడం వల్ల ఆ నాడీ కేంద్రాలు ప్రభావితం అవుతాయి. నడిచినప్పుడు ఈ మెట్టెలు నాడీ కేంద్రాలని నొక్కినట్టు అవుతాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా పాదాలకున్న రెండో వేలికి (బొటన వేలు పక్కన ఉన్న వేలు) నేరుగా గర్భాశయానికి అనుసంధాంచి ఉంటుంది. గర్భిణీలు మెట్టెలు పెట్టుకుంటే ఇంకా మంచిది.
వెండి మెట్టెలే ఎందుకు?
వెండి మెట్టెలు ధరించడం వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది. వెండి శరీరానికి మేలు చేస్తుంది. వెండి ప్రతికూల శక్తిని గ్రహించి… శరీరానికి శక్తిని ఇస్తుంది.
COMMENTS