Big update on new ration cards - Announcement to be issued only after that..!
TG New Ration Cards : కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్ - ఆ తర్వాతే జారీ చేస్తామని ప్రకటన..!
Telangana New Ration Card Updates : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన చేశారు. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి……
త్వరలోనే తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. ఆ దిశగా కసరత్తు నడుస్తోంది. ఇదే విషయంపై సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
శుక్రవారం కరీంనగర్ లో మాట్లాడిన ఉత్తమ్… రేషన్ కార్డుల జారీపై స్పందించారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులను ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు వేర్వేరుగా ఇస్తామని తెలిపారు. కేబినెట్ భేటీలో కొత్త రేషన్ కార్డు మార్గదర్శకాలపై చర్చిస్తామని చెప్పుకొచ్చారు.
కొత్త రేషన్ కార్డుల మార్గదర్శకాలు ఖరారైన వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి త్వరలోనే ఈ పంపిణీ ప్రక్రియను మొదలు పెట్టనున్నట్టు తెలిపారు,
ఏ ప్రతిపాదికన రేషన్ కార్డు ఇవ్వాలనే దానిపై క్లారిటీ రావాల్సి ఉందని… కేబినెట్ భేటీలో మార్గదర్శకాలను ఖరారు చేయగానే ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పుకొచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 90 లక్షల వరకు రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్త కార్డుల కోసం అవకాశం ఇస్తే… మరో 10 లక్షలు కుటుంబాల నుంచి దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా తెల్ల కాగితంపై రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. అంతేకాకుండా కుటుంబ సభ్యుల వివరాలను చేర్చే వారి నుంచి కూడా అప్లికేషన్లను తీసుకుంది. అయితే వీటి కోసం సదరు కుటుంబాలు… తెల్ల కాగితంపై రాసి దరఖాస్తు చేసుకున్నాయి.కొత్త రేషన్ కార్డులపై నిర్ణయం తీసుకుంటే… ఈసారి మీసేవా పోర్టల్ ద్వారా స్వీకరించే అవకాశం ఉంది.ప్రతి స్కీమ్ కు రేషన్ కార్డును ప్రమాణికంగా పరిగణిస్తున్న నేపథ్యంలో…. కొత్త కార్డుల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. త్వరలోనే వీటిపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది.
COMMENTS