TG EdCET PECET Counselling: Telangana Ed Set, PECET Counseling schedule is here
TG EdCET PECET Counselling : తెలంగాణ ఎడ్ సెట్, పీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది.
TG EdCET PECET Counselling : తెలంగాణ ఎడ్ సెట్, పీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. టీజీ ఎడ్‌సెట్, టీజీ పీఈసెట్ కోర్సుల్లో ప్రవేశాలకు జులై 31 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
టీజీ ఎడ్ సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్:
టీజీ ఎడ్‌సెట్ తో బీఈడీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఎడ్ సెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆగస్టు 8 నుంచి 20వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం ఈ తేదీల్లోనే అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఆగస్టు 12 నుంచి 16 వరకు స్పో్ర్ట్స్, ఎన్‌సీసీ, సీఏపీ, పీహెచ్ కేటగిరీల అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఆగస్టు 21న అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. ఆగస్టు 22, 23వ తేదీల్లో అభ్యర్థులు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వచ్చే 24న వెబ్ ఆప్షన్స్ ఎడిట్ కు అవకాశం కల్పిస్తారు. ఆగస్టు 30న మొదటి విడత సీట్ల కేటాయింపు లిస్ట్ విడుదల చేయనున్నారు. తొలి విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 4 వరకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 31 నుంచి బీఈడీ తరగతులు ప్రారంభం కానున్నాయి.
టీజీ పీఈసెట్ ద్వారా ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. పీఈసెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆగస్టు 7 నుంచి 14 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఆగస్టు 13, 14వ తేదీల్లో స్పోర్ట్, ఎన్‌సీసీ, సీఏపీ, పీహెచ్ కోటా అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఆగస్టు 14న అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. ఆగస్టు 16, 17 తేదీల్లో వెబ్ ఆప్షన్స్ కు అవకాశం కల్పిస్తారు. ఆగస్టు 18న వెబ్ ఆప్షన్స్ ఎడిట్ కు అవకాశం కల్పిస్తారు. ఆగస్టు 20న పీఈసెట్ మొదటి విడత సీట్ల కేటాయింపు జాబితా విడుదల చేస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 21 నుంచి 24 వరకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 27 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయని ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
టీజీ ఈఏపీసెట్ రెండో విడత కౌన్సెలింగ్:
తెలంగాణ ఉన్నత విద్యామండలి (టీఎస్ సీహెచ్ ఈ) టీజీ ఈఏపీ సెట్ 2024 ఫేజ్-2 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను జులై 26న ప్రారంభించింది. ఎంసెట్ 2024 ఫేజ్ 2 రిజిస్ట్రేషన్‌లో పాల్గొనాలనుకునే అభ్యర్థులు tgeapcet.nic.in అధికారిక వెబ్‌సైట్ సందర్శించవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న షెడ్యూల్ ప్రకారం, ప్రాథమిక సమాచారం ఆన్‌లైన్‌లో దాఖలు చేయడం, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, హెల్ప్‌లైన్ సెంటర్ ఎంపిక కోసం బుకింగ్, మొదటి దశలో హాజరుకాని అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సిన తేదీ రెండో దశ కౌన్సెలింగ్ ప్రక్రియలో తెలుసుకోవచ్చు. ఈ ప్రక్రియ నిన్నటి నుంచి ప్రారంభం అయ్యింది.
అభ్యర్థులు 2024 జులై 27 నుంచి 2024 జూలై 28 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత ఆప్షన్ల పరిశీలనకు వెళ్లవచ్చు. ఆప్షన్ల భర్తీ 2024 జూలై 28న జరుగుతుందని, 2024 జూలై 31 లేదా అంతకంటే ముందు సీట్ల తాత్కాలిక కేటాయింపు అందుబాటులో ఉంటుందని కన్వీనర్ తెలిపారు. అభ్యర్థులు జులై 31, 2024 నుంచి ఆగస్టు 2, 2024 వరకు వెబ్‌సైట్లో ట్యూషన్ ఫీజు చెల్లింపు మరియు సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయవచ్చు. రెండో విడత కౌన్సెలింగ్ లో సీట్లు పొంది, కేటాయించిన కళాశాలలో రిపోర్టు చేయని వారికి తుది విడత కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు తీసుకునేందుకు అనుమతి లేదని అభ్యర్థులు గుర్తించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. రెండో దశ కేటాయింపు తర్వాత కేటాయించిన కళాశాలలో అభ్యర్థి ఫిజికల్ రిపోర్టింగ్ తప్పనిసరి అని అధికారిక నోటీసులో పేర్కొన్నారు. అభ్యర్థులు తమకు కేటాయించిన కళాశాలలో సర్టిఫికెట్లు, ఒరిజినల్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (టీసీ) జిరాక్స్ కాపీలను అందజేయాల్సి ఉంటుంది.
COMMENTS