TG CPGET 2024 Updates : Admissions to PG Courses... CPGET 'Key' Released, Response Sheets Available - Here's the Link
TG CPGET 2024 Updates : పీజీ కోర్సుల్లో ప్రవేశాలు... సీపీగెట్ 'కీ' విడుదల, అందుబాటులోకి రెస్పాన్స్ షీట్లు - లింక్ ఇదే.
TG CPGET 2024 Updates : పీజీ ప్రవేశాల కోసం నిర్వహించిన సీపీగెట్ - 2024కు సంబంధించిన వివిధ సబ్జెక్టుల ప్రాథమిక కీ విడుదలైంది. https://cpget.tsche.ac.in లింక్ తో కీతో పాటు రెస్పాన్స్ షీట్లను కూడా పొందవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ పీజీ ప్రవేశాలు 2024:
Telangana CPGET 2024 : పీజీ ప్రవేశాలకు(టీఎస్ సీపీగెట్-2024) సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే పరీక్షలు పూర్తి కాగా… తాజాగా ప్రాథమిక కీతో పాటు రెస్పాన్స్ షీట్లు అందుబాటులోకి వచ్చాయి. https://cpget.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి కీతో పాటు రెస్పాన్స్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రాథమిక కీపై ఏమనా అభ్యంతరాలు ఉంటే cpget.helpdesk@gmail.com కు పంపాల్సి ఉంటుంది. ఇందుకు జులై 25వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. మొత్తం 45 సబ్జెక్టులకుగాను జులై 6వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కాగా… జులై 17వ తేదీతో ముగిశాయి.
రాష్ట్రంలోని ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, మహిళా యూనివర్సిటీలు, జేఎన్‌టీయూహెచ్ పరిధిలో ఉన్న 297 పీజీ కాలేజీల్లో 45 కోర్సుల్లో ప్రవేశాలకు సీపీగెట్ 2024 నిర్వహించారు. మే 18 నుంచి జూన్ 17 వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరించారు.
రాష్ట్రవ్యాప్తంగా 44,604 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీపీగెట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీలో ఏ సబ్జెక్టు చేసినా, పీజీలో ఇష్టమొచ్చిన సామాజిక కోర్సుల్లో చేరేందుకు వీలు కల్పిస్తున్నారు. ఎంబీబీఎస్, బీటెక్ విద్యార్థులు కూడా ఎంఏ, ఎంకామ్ వంటి కోర్సుల్లో చేరే వీలుంది.
మొత్తం 100 మార్కులకు సీపీగెట్ పరీక్ష నిర్వహించారు.ఈ ఏడాది ఉస్మానియా వర్శిటీ నిర్వహించింది. ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఫలితాల విడుదల తర్వాత… కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటిస్తారు.
సీపీగెట్ కీని ఇలా చూడండి…
పీజీ ప్రవేశాల కోసం సీపీగెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు https://cpget.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
హోంపేజీలో కనిపించే Master Question paper with Preliminary key అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
ఇక్కడ మీకు సబ్జెక్టుల పేర్లు కనిపిస్తాయి. మీరు రాసిన పేపర్ పై క్లిక్ చేయాలి. మీకు ప్రాథమిక కీ డిస్ ప్లే అవుతుంది.
ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
రెస్పాన్స్ షీట్లను ఇలా పొందవచ్చు….
- పీజీ ప్రవేశాల కోసం సీపీగెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు https://cpget.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలో కనిపించే Response Sheet అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ Registration Number తో పాటు హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
- ఇక్కడ క్లిక్ చేస్తే మీ రెస్పాన్స్ షీట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
- ప్రాథమిక కీపై ఉండే అభ్యంతరాలను పంపాల్సిన email id: cpget.helpdesk@gmail.com
COMMENTS