TG Anganwadis : Anganwadis are good news of Telangana Sarkar, green signal for retirement benefits
TG Anganwadis : అంగన్వాడీలు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కు గ్రీన్ సిగ్నల్.
TG Anganwadis : తెలంగాణ సర్కార్ అంగన్వాడీ టీచర్లు, సిబ్బందికి గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్వాడీల ఆందోళనలపై సానుకూలంగా స్పందించింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పై కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ టీచర్లకు పదవీ విరమణ తర్వాత రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.1 లక్ష చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రెండు, మూడు రోజుల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ పై ప్రభుత్వం జీవో విడుదల చేయనుంది. హైదరాబాద్ రహమత్ నగరంలో 'అమ్మ మాట-అంగన్వాడీ బాట' అనే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్స్ పై స్పందించారు. రెండు మూడ్రోజులల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు సంబంధించిన అధికారిక జీవో విడుదల చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ హయంలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు పడే పరిస్థితి లేదని, కాంగ్రెస్ పాలనలో ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు పడుతున్నాయని మంత్రి సీతక్క అన్నారు. ఉద్యోగులకు సమస్యలు పరిష్కరిస్తామని, వారి న్యాయమైన డిమాండ్లు నెరవేరుస్తామన్నారు. మంత్రి సీతక్క ప్రకటనతో అంగన్వాడీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీవో నెంబర్ 10 రద్దు సహా మిగతా సమస్యలు కూడా పరిష్కరించాలని కోరుతున్నారు. అలాగే జీతాలు కూడా పెంచాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.
జీవో నెంబర్ 10 రద్దు చేయాలి:
జీవో నెంబర్ 10 రద్దు చేయాలని సోమవారం అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసలు తెలిపారు. ఎమ్మెల్యేల ఇల్లు, క్యాంపు కార్యాలయాలు ముట్టడించారు. అంగన్వాడీలు, సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా అంగన్వాడీ టీచర్లకు రూ.18 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జులై 1 వరకు 65 ఏళ్లు నిండిన టీచర్లు, హెల్పర్లను పదవీ విరమణ చేయాలని జారీచేసిన జీవో నెంబర్ 10ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని లేకపోతే డిమాండ్ల సాధన కోసం 19న శిశు సంక్షేమ శాఖ కార్యాలయాలను ముట్టడిస్తామని ప్రకటించారు. అంగన్వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, ఆయాలకు రూ.1 లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, రూ.5 వేల పింఛన్, జీవో నెం.10 రద్దు చేయాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు.
రూ.5 వేల పింఛన్ ఇవ్వాలని డిమాండ్:
అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంగన్వాడీలు సమ్మె చేశారు. దీంతో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అంగన్వాడీ ఆయాలకు రూ.లక్ష, టీచర్లకు రూ. 2 లక్షలు పదవీ విరమణ ప్రయోజనాలు కల్పి్స్తామని హామీ ఇవ్వడంతో అంగన్వాడీలు సమ్మె విరమించారు. ప్రభుత్వం మారడంతో ఆ హామీలు నెరవేరలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో పాటు హెల్పర్ల వేతనం రూ.7600 ఇస్తే, అందులో రూ.3,300, అంగన్‌వాడీ టీచర్లకు వేతనం రూ.10,300 లో సగం రూ.5150 నెలసరి పింఛన్ అందించాలని కోరుతున్నారు.
COMMENTS