Are you afraid to stop eating sugar? Do you know what is happening in your body?
భయపడి షుగర్ తినడం మానేస్తున్నారా? మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?
What Happens Not Eating Sugar : చక్కెర కార్బోహైడ్రేట్లా పనిచేస్తుంది. శరీరం చక్కెరను గ్లూకోజ్‌లా మార్చి విచ్ఛిన్నం చేస్తుంది. ఇది మీకు కావలసిన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అయితే మార్కెట్లో దొరికే వివిధ రకాల చక్కెరల్లో కొన్ని సహజంగా పండ్లు, పాల ఉత్పత్తులతో తయారయితే మరికొన్ని మాత్రం హానికరమైన పదార్థాలతో తయారవుతున్నాయి. రోజూవారీ ఆహారంలో చేర్చినప్పుడు ఇవి మీ ఆరోగ్యాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయి. వాస్తవానికి చక్కెర శరీరానికి గ్లూకోజ్ లా శక్తిని అందిస్తుంది. కానీ దాంతో పాటుగా రక్తంలో చక్కెర స్థాయిలను కూడా పెంచుతుంది. దీర్ఘకాలికంగా ఇది మధుమేహానికి దారితీస్తుంది. అందుకే ఈ మధ్య కాలంలో చాలా మంది చక్కెర తినడ పూర్తిగా మానేస్తున్నారు. ఇలా చక్కెర వినియోగాన్ని తగ్గించడం వల్ల మీ శరీరానికి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉందా? ఉంటే ఇక్కడ తెలుసుకోవచ్చు!
బరువు విషయంలో!
మీరు తీసుకునే ఆహారాల్లో చక్కెర తగ్గినప్పుడు శరీర బరువు గణనీయంగా తగ్గుతుంది. ఎందుకంటే చక్కెరలో ఖాళీ కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆకలిని, అతిగా తినడాన్ని ప్రేరేపిస్తాయి. చక్కెరకు దూరంగా ఉండటం వల్ల ఆకలి తగ్గి అతిగా తినడం మానేస్తారు. ఫలితంగా బరువు తగ్గుతారు.
శక్తి స్థాయిల్లో!
చక్కెర అనేది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను వేగంగా పెంచుతుంది. తద్వారా రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. శక్తి స్థాయిల్లో హెచ్చు తగ్గులు ఏర్పడతాయి. చక్కెరను తీసుకోవడం మానేయడం వల్ల రక్తంలో, శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇవి రోజంగా మీ శక్తిని స్థిరంగా ఉంచుతాయి.
చర్మ ఆరోగ్యానికి!
అధిక చక్కెర వినియోగం మొటిమలు, రోసేసియా వంటి చర్మ సమస్యలను తీవ్రతరం చేస్తుంది. ఇది తగ్గించడం వల్ల మొటిమలు, మంట తగ్గి, చర్మం స్పష్టంగా మెరుసేలా తయారవుతుంది.
గుండె ఆరోగ్యానికి!
చక్కెర తీసుకోవడం తగ్గించినప్పుడు ఆటోమెటిక్‌గా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె జబ్బులకు దారితీసే కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా మారుతుంది.
అభిజ్ఞా పనితీరు!
చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చక్కెర వినియోగం అభిజ్ఞా పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. చక్కెరను అధికంగా తీసుకోవడం వల్ల బ్రెయిర్ ఫాగ్ సమస్య అభివృద్ధి చెందుతుంది. దీన్ని తగ్గించడం వల్ల మానసిక స్పష్టత, ఫోకస్ పెరిగి అభిజ్ఞా పనితీరు మెరుగవుతుంది.
మూడ్ మార్పు!
చక్కెర ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మారు మూడ్ స్వింగ్స్ సమస్య ఏర్పడుతుంది. తగ్గించి తినడం వల్ల మానసిక స్థిరత్వం పెరగి మూడ్ స్వింగ్స్‌తో మొత్తం మెదడు ఆరోగ్యం మెరుగవుతుంది.
పేగుల ఆరోగ్యం!
ఆహారంలో చక్కెర ఎక్కువయినప్పుడు గట్ బ్యాక్టీరియాల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. చక్కెరను తగ్గించడం వల్ల ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్ ను నిర్వహించవచ్చు. తద్వార జీర్ణక్రియ, పోషకాల శోషణ మెరుగవుతాయి.
దంత ఆరోగ్యం!
తీపి తినడం వల్ల దంతాల్లో క్షయం, కావిటీస్ వంటి దంత సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని అందరికీ తెలిసిందే. కనుక చక్కెర తినడం తగ్గించడం వల్ల దంత సమస్యల నుంచి దూరంగా ఉండచ్చు.
దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో!
అధిక చక్కెర వినియోగం వల్ల టైప్-2 డయాబెటిస్, గుండె జబ్బులతో పాటు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. చక్కెర తినడం తగ్గించడం వల్ల ఈ వ్యాధుల ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
COMMENTS