Singareni Jobs 2024 : 327 Jobs in Singareni - Exams and Hall Tickets on August 6 and 7 This is the link..!
Singareni Jobs 2024 : సింగరేణిలో 327 ఉద్యోగాలు - ఆగస్టు 6, 7 తేదీల్లో పరీక్షలు, హాల్ టికెట్ల లింక్ ఇదే..!
Singareni Jobs 2024 : సింగరేణి యాజమాన్యం మార్చి నెలలో విడుదల చేసిన ఎక్స్‌టర్నల్ సెకండ్ నోటిఫికేషన్‌లో భాగంగా ఏడు విభాగాల్లో 327 పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే ఈ ఉద్యోగ రాత పరీక్షలను సింగరేణి యాజమాన్యం ఖరారు చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
ఈ పరీక్షలు ఆగస్టు 6, 7 తేదీల్లో జరుగుతాయని పేర్కొంది. 7 రకాల కేటగిరీ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. https://scclmines.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి హాల్ టికెట్ల డౌన్లోడ్ తో పాటు పరీక్షల షెడ్యూల్ ను చెక్ చేసుకోవచ్చని వివరించింది.
షెడ్యూల్ ప్రకారం మొదటి రోజు అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రెయినీ (ఎలక్ట్రికల్) టీఅండ్‌ఎస్ గ్రేడ్ –సీ, జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రెయినీ, ఎలక్ట్రీషియన్ ట్రెయినీ కేటగిరీ– 1, ఫిట్టర్ కేటగిరీ –1 పరీక్షలను నిర్వహించనున్నరు. ఇక రెండో రోజు అంటే ఆగస్టు 7వ తేదీన మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఈఅండ్‌ఎం) ఈ –2 గ్రేడ్, మేనేజ్‌మెంట్ ట్రెయినీ (సిస్టమ్) ఈ–2 గ్రేడ్, అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రెయినీ (మెకానికల్) టీఅండ్‌ఎస్ గ్రేడ్ – సీ పరీక్షలు జరగనున్నాయి.
‘కీ’ విడుదల…
సింగరేణిలో 272 ఉద్యోగాల భర్తీకి రెండు రోజుల పాటు నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జులై 21వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షలకు సంబంధించి… సింగరేణి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ‘కీ’ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గురువారం(జులై 25) ప్రకటన చేశారు.
కంప్యూటర్ ఆధారిత పరీక్షల "కీ" ని https://scclmines.com వెబ్ సైట్ లో పొందుపరచడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే జులై 27వ తేదీలోగా తెలిపే అవకాశం ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపారు.
సింగరేణి సంస్థలో 272 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి రెండు రోజులపాటు పరీక్షలను నిర్వహించారు. 12 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు 12,045 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అభ్యర్థులు ఎప్పటికప్పుడు పూర్తి వివరాలను https://scclmines.com/ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
సింగరేణి సంస్థలో 272 ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి నెలలో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. వీటిలో ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (మైనింగ్) పోస్టులు 139, మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఐఈ) - 10, జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ -10, మేనేజ్‌మెంట్ ట్రైనీ (హైడ్రో–జియాలజిస్ట్) - 02, మేనేజ్‌మెంట్ ట్రైనీ (సివిల్) -18, మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎఫ్ అండ్ ఏ) - 22, మేనేజ్‌మెంట్ ట్రైనీ (పర్సనల్) - 22, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ - 3, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ - 30 ఉన్నాయన్నారు. నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌లో సబ్ ఓవర్సీస్ ట్రైనీ (సివిల్) - 16 పోస్టులు ఉన్నాయి.
COMMENTS