Apprentice Recruitment in Railways; 2424 posts; Only 10th class is eligible
Railway Apprentice Recruitment 2024: రైల్వేలో అప్రెంటిస్ రిక్రూట్మెంట్; 2424 పోస్ట్ లు; అర్హత పదో తరగతి మాత్రమే.
సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు రైల్వే రిక్రూట్మెంట్ సెల్, సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్సైట్ rrccr.com ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 2424 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఆగస్ట్ 15 లాస్ట్ డేట్:
రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 16న ప్రారంభమై 2024 ఆగస్టు 15న ముగుస్తుంది. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాల కోసం రైల్వే రిక్రూట్మెంట్ సెల్, సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్సైట్ rrccr.com ను పరిశీలించవచ్చు.
అర్హత ప్రమాణాలు:
దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కనీసం 50% మార్కులతో పదో తరగతి పరీక్ష లేదా తత్సమాన (10+2 పరీక్షా విధానంలో) ఉత్తీర్ణులై ఉండాలి. అదనంగా, గుర్తింపు పొందిన బోర్డు నుండి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 15-7-2024 నాటికి 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. మెట్రిక్యులేషన్ (కనీసం 50% మొత్తం మార్కులతో) తో పాటు అప్రెంటిస్ షిప్ చేయాల్సిన ట్రేడ్ ఐటీఐ మార్కుల శాతం ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. మెట్రిక్యులేషన్, ఐటీఐలో సాధారణ సగటు మార్కుల ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్ట్ లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఈ పేమెంట్ ఆన్ లైన్ లోనే చెల్లించాలి. డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డు/ ఇంటర్నెట్ బ్యాంకింగ్/ ఎస్బీఐ చలానా మొదలైన వాటిని ఉపయోగించి స్క్రీన్ పై అడిగిన సమాచారాన్ని అందించడం ద్వారా చెల్లింపు చేయవచ్చు. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్సైట్ ను చూడవచ్చు.
COMMENTS