Oats flour Roti Benefits : Adding this flour to chapatis works wonders - all the fat in your stomach will melt away!
చపాతీలలో ఈ పిండి కలిపితే అద్భుతం జరుగుతుంది - మీ ఒంట్లో కొవ్వు మొత్తం ఇట్టే కరిగిపోతుంది!
Oats flour Roti Benefits : అధిక బరువు తగ్గించుకోవాలని ప్రయత్నాలు చేసే వారిలో చాలా మంది రాత్రివేళ చపాతీలు తింటుంటారు. అయితే.. చపాతీల పిండిలో మరొక పిండిని కలుపుకుంటే.. కొవ్వును మరింత వేగంగా తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరి.. ఆ పిండి ఏంటి? చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి అది ఏవిధంగా సహాయ పడుతుంది? అన్నది ఇప్పుడు చూద్దాం.
ఈ పిండి కలిపి చపాతీ చేయండి :
గోధుమలలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల చపాతీలు తినడం ద్వారా బరువు తగ్గే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఈ కారణంగానే చాలా మంది ఒక పూట చపాతీలు తింటూ ఉంటారు. అయితే.. చపాతీ పిండిలో.. ఓట్స్ పిండి కలుపుకొని చపాతీలు చేసుకోవడం ద్వారా మరింత వేగంగా చెడు కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఓట్స్ పిండితో తయారు చేసిన చపాతీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అంటున్నారు.
పోషకాలు ఎక్కువే..
ఓట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది హెల్దీగా ఉండేలా చేస్తుంది. అలాగే.. ఓట్స్‌లో పొటాషియం, మెగ్నీషియం, శక్తి వంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి బరువు తగ్గేలా చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. 2004లో 'అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. ఓట్స్ తినే వారిలో.. తినని వారితో పోలిస్తే LDL కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గినట్టు కనుగొన్నారు. ఈ పరిశోధనలో అమెరికాలోని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన న్యూట్రీషియన్ సైన్స్ ప్రొఫెసర్ 'డాక్టర్ క్రిస్టోఫర్ M. డెన్నింగ్‌హామ్' పాల్గొన్నారు.
ఓట్స్‌తో లాభాలు..
- ప్రస్తుత కాలంలో చాలా మంది మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీరు ఓట్స్ పిండితో కలిపి తయారు చేసిన చపాతీలు తినడం వల్ల ఈ సమస్యలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
- ఓట్స్‌లోని బీటా గ్లూకాన్.. కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
- ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పాలీఫినాల్స్ శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
- ఓట్స్ ఉండే కొన్ని మినరల్స్ ఎముకలను దృఢంగా ఉంచుతాయి.
- మధుమేహం ఉన్నవారు ఓట్స్ పిండితో తయారు చేసిన చపాతీలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉండేలా చూసుకోవచ్చు.
- ఓట్స్ వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టే.. చపాతీల పిండిలో కొద్దిగా ఓట్స్ పిండిని కలుపుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
COMMENTS