LIC HFL Recruitment 2024: Recruitment in LIC Housing Finance Limited; Qualification degree only...
LIC HFL Recruitment 2024: ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ లో రిక్రూట్మెంట్; అర్హత డిగ్రీ మాత్రమే...
జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LICHFL) నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ అధికారిక వెబ్ సైట్ lichousing.com ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 200 పోస్టులను భర్తీ చేయనున్నారు.
లాస్ట్ డేట్ ఆగస్ట్ 14..:
ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ (LICHFL) లో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2024 జూలై 25న ప్రారంభమై, ఆగస్టు 14న ముగుస్తుంది. ఆన్లైన్ పరీక్షకు కాల్ లెటర్లను పరీక్షకు 7 నుంచి 14 రోజుల ముందు వెబ సైట్ లో అందుబాటులో ఉంచుతారు. వాటిని అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ ఆన్లైన్ పరీక్షను 2024 సెప్టెంబర్లో నిర్వహిస్తారు.
ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ లో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ లకు అర్హత:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు భారత ప్రభుత్వం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ (కనీసం 60% మార్కులు) లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే, 01.07.2024 నాటికి 21 ఏళ్లకు తగ్గకుండా, 28 ఏళ్లకు మించకుండా ఉండాలి. అంటే, అభ్యర్థులు 02.07.1996 - 01.07.2003 మధ్య జన్మించి ఉండాలి (రెండు తేదీలు కలుపుకొని).
ఎంపిక విధానం:
ఎంపిక విధానంలో ఆన్లైన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్, లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ స్కిల్ విభాగాల్లో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. మొత్తం రెండు గంటల వ్యవధిలో ఈ పరీక్ష రాయాలి. మొత్తం ప్రశ్నల సంఖ్య 200, గరిష్ఠ మార్కులు 200. ఆన్లైన్ పరీక్ష ఇంగ్లిష్ భాషలో మాత్రమే ఉంటుంది. ఆన్ లైన్ పరీక్షలో తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. తుది మెరిట్ జాబితా, అభ్యర్థుల ఎంపిక ఆన్ లైన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూల కంబైన్డ్ మార్కుల ఆధారంగా జరుగుతుంది.
దరఖాస్తు ఫీజు:
ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ లో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ లకు అప్లై చేయడానికి రూ.800లను అప్లికేషన్ ఫీజు గా చెల్లించాలి. అప్లికేషన్ ఫీజుపై 18% జీఎస్టీ ఉంటుంది. ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫీజు/ఇన్ఫర్మేషన్ ఛార్జీల చెల్లింపు కోసం బ్యాంకు లావాదేవీ ఛార్జీలను అభ్యర్థి భరించాల్సి ఉంటుంది.
COMMENTS