Didn't get your tax refund? Just do this.. money into the account!
IT Refund: మీకు ట్యాక్స్ రిఫండ్ రాలేదా? ఇలా చేస్తే చాలు.. ఖాతాలోకి డబ్బులు!
IT Refund: అర్హులైన వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్ చెల్లిస్తుంది ఐటీ శాఖ. వారు అడ్వాన్స్ ట్యాక్స్, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్, టీటీడీఎస్ లేదా టీసీఎస్ రూపంలో చెల్లించాల్సిన ట్యాక్స్ కన్నా ఎక్కువ చెల్లించినప్పుడు రిఫండ్ ఇస్తుంది. అన్ని రకాల మినహాయింపులు, డిడక్షన్లు పరిగణనలోకి తీసుకుని అదనపు పన్నును తిరిగి ట్యాక్స్ పేయర్ల ఖాతాల్లో జమ చేస్తుంది. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు జులై 31వ తేదీ వరకు గడువు ఉంటుంది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే ఐటీఆర్ దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటికే లక్షల మంది తమ రిటర్న్స్ ఫైల్ చేసి రిఫండ్ కోసం చూస్తున్నారు.
ఐటీఆర్ ఫైల్ చేసి ఇ-వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న తర్వాత సదరు ఐటీ రిటర్నులను ప్రాసెసింగ్ చేస్తుంది ఐటీ శాఖ. ఇందుకు 4-5 వారాల సమయం పడుతుంది. ప్రాసెసింగ్ పూర్తయిన ఐటీ రిటర్నులకు సంబంధించిన రిఫండ్స్‌ని బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే, ట్యాక్స్ పేయర్లు ఎప్పటికప్పుడు తమ స్టేటస్ తెలుసుకుంటూ ఉండాలి. అలాగే ఐటీఆర్‌లో ఏవైనా ఎర్రర్స్ ఉన్నాయా అని చూసుకోవాలి. ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి మెయిల్స్ వస్తుంటాయి. వాటిని తరుచుగా చెక్ చేసుకుంటూ ఉండాలి. 4-5 వారాల్లోగా రిఫండ్ రాకుంటే ఎక్కడో సమస్య తలెత్తిందని గుర్తుంచుకోవాలి. ఇలా మీకు రిఫండ్ సమయంలోపు రానప్పుడు ఏం చేయాలో ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం సోషల్ మీడియా వేదికగా కీలక సూచనలు చేసింది.
'మీ రిఫండ్ ఏదైనా కారణం చేత జమ కాకుంటే మీరు రిఫండ్ రీఇష్యూ రిక్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి' అని ఎక్స్ వేదికగా వెల్లడించింది.
రిఫండ్ రీఇష్యూ రిక్వెస్ట్ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
- ముందుగా ఇన్‌కమ్ ట్యాక్స్ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ కావాలి.
- సర్వీసెస్ మెనూలోకి వెళ్లి రిఫండ్ రీఇష్యూ ఎంపిక చేసుకోవాలి.
- ఆ తర్వాత రిఫండ్ రీఇష్యూ రిక్వెస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- మీరు సబ్మిట్ చేయాల్సిన రికార్డును ఎంచుకోవాలి.
- ఆ తర్వాత రిఫండ్ జమ కావాల్సిన బ్యాంక్ ఖాతాను ఎంచుకోవాలి. ఒక వేళ మీ ఖాతా వాలిడేట్ చేయకుంటే ముందుగా ఆ పని పూర్తి చేయాలి.
- ఈ ప్రాసెస్ తర్వాత ప్రొసీడ్ ఫర్ వెరిఫికేషన్ పై క్లిక్ చేయాలి.
- ఆధార్ ఓటీపీ, ఈవీసీ, డీఎస్‌సీ వంటి వాటిల్లో మీకు అనువైన ఇ-వెరిఫికేషన్ మెథడ్ ఎంచుకోవాలి.
- కంటిన్యూపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు ట్రాన్సాక్షన్ ఐడీతో పాటు సక్సెస్ మెసేజ్ వస్తుంది.
- సర్వీస్ రిక్వెస్ట్ ఆప్షన్‌లోకి వెళ్లి మీ స్టేటస్ తెలుసుకోవచ్చు.
COMMENTS