Indian Railways: If you do this in the train, you will be arrested.. The sensational decision of the Indian Railways
Indian Railways: రైల్లో ఇలా చేస్తే అరెస్టు.. భారత రైల్వే సంచలన నిర్ణయం.
ప్రస్తుత తరం సోషల్ మీడియా అనేది ఒక ట్రెండ్‌గా మారిపోతుంది. లైక్‌లు, షేర్లు, వ్యూస్ కోసం రకరకాల వీడియోలు పోస్టు చేస్తున్నారు. కాని కొన్ని సార్లు సమస్యలుగా మారే అవకాశం ఉంటుంది. తమ ప్రాణాలను పణంగా పెట్టినా పట్టించుకోరు. అయితే రైల్లో ఇలాంటి స్టంట్ చేయాలంటే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీరు రైలులో లేదా స్టేషన్‌లో సోషల్ మీడియా కోసం ఏవైనా స్టంట్స్ చేసినట్లయితే మీరు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఇందు కోసం భారతీయ రైల్వే కఠిన చర్యలు తీసుకుంటుంది.
కదులుతున్న రైలులోనో, స్టేషన్‌లోనో నిలబడి రకరకాల విన్యాసాలు చేస్తూ ఇటీవల సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు చాలానే వస్తున్నాయి. ఈ రకమైన వీడియో వైరల్ కావడంతో సెంట్రల్ రైల్వే గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి వీడియోలు తీసిన వారిపై కేసు నమోదు చేయాలని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లేదా ఆర్పీఎఫ్‌ని ఆదేశించింది.
ముంబైలోని సెవ్రీ స్టేషన్‌లో ఓ యువకుడు లోకల్ ట్రైన్ డోర్‌కు వేలాడుతూ ప్లాట్‌ఫారమ్‌పైకి పరుగెత్తుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో వైరల్ కావడంతో సెంట్రల్ రైల్వే కఠిన చర్యలకు ఆదేశించింది. వీడియోలో స్టంట్ చేస్తున్న యువకుడి కోసం గాలిస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు.
ప్రయాణికులు తమ ప్రాణాలకు లేదా ఇతరులకు హాని కలిగించే ఇలాంటి కార్యకలాపాలను మానుకోవాలని సెంట్రల్ రైల్వే పత్రికా ప్రకటన విడుదల చేసింది. అయితే ఇలాంటి వీడియోలో సోషల్ మీడియాలో ఇటీవల చాలానే వస్తున్నాయి. దీంతో రైల్వే నిబంధనలు మరింత కఠినతరం చేస్తోంది. ఇలాంటి ప్రమాదకరమైన వీడియోలు చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తోంది.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS