INCET 2024 : Indian Navy Recruitment - Full details along with vacancies..
INCET 2024 : ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్- వేకెన్సీలతో పాటు పూర్తి వివరాలు..
ఐఎన్‌సీఈటీ (ఇండియన్ నేవల్ సివీలియన్ ఎంట్రెన్స్ టెస్ట్) 2024లో భాగంగా రిక్రూట్మెంట్ డ్రైవ్‌కి నోటిఫికిషేన్ని విడుదల చేసింది భారత నౌకాదళం. వివిధ సివీలియన్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. జులై 20న మొదలైన ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ ఆగస్ట్ 2 వరకు కొనసాగుతుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు incet.cbt-exam.in అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.
ఈ దఫా రిక్రూట్మెంట్లో మొత్తం 741 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిల్లో ఛార్జ్‌మెన్, సైంటిఫిక్ అసిస్టెంట్, ఫైర్‌మెన్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్, డ్రాట్స్‌మెన్, ట్రేడ్స్‌మెన్ మేట్, పెస్ట్ కంట్రోల్ వర్కర్, కుక్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్‌లకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి.
అప్లికేషన్ ఫీజు..
జనరల్/ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ. 295 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీలకు అప్లికేషన్ ఫీజు ఉండదు.
సెలక్షన్ ప్రక్రియ..
ఇండియన్ నేవీ సివీలియన్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో భాగంగా రాత పరీక్ష, భౌతిక పరీక్ష (ఫైర్‌మెన్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్లకు మాత్రమే), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ వంటివి ఎంపిక ప్రక్రియలో భాగం.
వయస్సు పరిమితి..
ఛార్జ్‌మెన్, సైంటిఫిక్ అసిస్టెంట్- 18 నుంచి 30ఏళ్లు
ఫైర్‌మెన్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్- 18 నుంచి 27ఏళ్లు
ఇతర పోస్టులు- 18 నుంచి 25ఏళ్లు.
పోస్టుల వారీగా వేకెన్సీలు- విద్యార్హత వివరాలు..
మల్టీ- టాస్కింగ్ స్టాఫ్- 16 పోస్టులు. గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి క్లాస్ 10 లేదా ఐటీఐ సర్టిఫికేట్.
ఫైర్‌మెన్- 444 పోస్టులు. గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి క్లాస్ 10 లేదా ఐటీఐ సర్టిఫికేట్.
ట్రైడ్స్మెన్ మేట్- 161 పోస్టులు. గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి క్లాస్ 10 లేదా ఐటీఐ సర్టిఫికేట్.
పెస్ట్ కంట్రోల్ వర్కర్- 18 పోస్టులు. గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి క్లాస్ 10 లేదా ఐటీఐ సర్టిఫికేట్. హిందీ/ స్థానిక భాషలపై పట్టు ఉండాలి.
ఫైర్ ఇంజిన్ డ్రైవర్- 58 పోస్టులు. 12వ తరగతి పాస్ అయ్యుండాలి. హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండాలి.
కుక్- 9 పోస్టులు. 10వ తరగతి పాస్ అయ్యుండాలి. ఒక ఏడాది ఎక్స్‌పీరియెన్స్ ఉండాలి.
ఛార్జ్‌మెన్ అమ్యూనేషన్ వర్క్‌షాప్- 1 పోస్టు. బీఎస్సీ డిగ్రీ (ఫిజిక్స్/కెమిస్ట్రీ/మాథ్య్స్) లేదా కెమికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా
ఛార్జ్‌మెన్ ఫ్యాక్టరీ- 10 పోస్టులు. బీఎస్సీ డిగ్రీ (ఫిజిక్స్/కెమిస్ట్రీ/మాథ్య్స్) లేదా ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా
ఛార్జ్‌మెన్ మెకానిక్- 18 పోస్టులు. మెకానికల్/ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా
సైంటిఫిక్ అసిస్టెంట్- 4 పోస్టులు. ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ ఎలక్ట్రానిక్స్/ ఓషనోగ్రఫీలో బీఎస్సీ డిగ్రీ. 2ఏళ్ల ఎక్స్‌పీరియెన్స్
డ్రాట్స్‌మెన్ కన్స్ట్రక్షన్- 2 పోస్టులు. క్లాస్ 10 పాస్, డ్రాట్స్మెన్షిప్లో రెండేళ్ల అనుభవం. ట్రైనింగ్ స్కీమ్‌లో మూడేళ్ల అప్రెంటీస్‌షిప్ లేదా ఐటీఐ సర్టిఫికేషన్.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS