Ignou Admissions: The deadline for receipt of applications for IGNOU admissions has been extended till July 15
Ignou Admissions: ఇగ్నోలో ప్రవేశాలకు జూలై 15 వరకు దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగింపు.
Ignou Admissions: ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) ప్రవేశాలకు గడువు పొడిగించింది. జులై 15వ తేదీ వరకు గడువు పెంచింది. ఈ మేరకు ఇగ్నో విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ గోనిపాటి ధర్మారావు తెలిపారు. ఇగ్నోలో డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. వీటి జులై ప్రవేశాలకు గడువు పొడిగించారు.
ప్రవేశాలు ఆన్‌లైన్ విధానంలో జరుగుతాయి. దరఖాస్తును ఆన్‌లైన్‌లోనే దాఖలు చేయాల్సి ఉంటుంది. యూనివర్శిటీ అధికారిక వెబ్‌సైట్ లింక్ లో https://ignouadmission.samarth.edu.in/దరఖాస్తు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆయా కోర్సులకు జులై 15 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
కొత్తగా ఎంబీఏ కోర్సులు
2024-జులై విద్యా సంవత్సరానికి అడ్మిషన్‌లో భాగంగా వివిధ దూర విద్యా కోర్సులతో పాటు ఈ నాలుగు ఎంబీఏ కోర్సులను అందుబాటులోకి తెచ్చినట్లు విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రం సంచాలకుడు గోనిపాటి ధర్మారావు తెలిపారు. అవి ఎంబీఏ హెల్త్‌కేర్, అండ్ హాస్పటల్ మేనేజ్‌మెంట్, ఎంబీఏ అగ్రి బీజీనెస్ మేనేజ్‌మెంట్, ఎంబీఏ కనస్ట్రక్షన్ మేనేజ్‌మెంట్, ఎంబీఏ లాజిస్టిక్స్ అండ్ సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ కోర్సులు కొత్తగా అందుబాటులోకి తెచ్చింది. రెండేళ్ల కాల వ్యవధిలో అందిస్తున్న ఈ కోర్సుల్లో ఏదైనా డిగ్రీ అర్హతతో చేరొచ్చు. ఫీజు ఒక్కొ కోర్సుకు 64 వేలు రూపాయలు ఉంటుంది. వివరాల కోసం తమ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
అప్లికేషన్ దాఖలకు గడువు జులై 15వ తేదీగా ఇగ్నో నిర్ణయించింది. ఆసక్తి గల అభ్యర్థులు యూనివర్శిటీ అధికారిక వెబ్‌సైట్ ignou admission.samarth.edu.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగరు. అదనపు సమచారం కోసం ఇగ్నో అధ్యయన కేంద్రాలనుగానీ, ప్రాంతీయ కేంద్రాన్నిగానీ సంప్రదించవచ్చు. అలాగే 0891-2511200 ఫోన్ నంబర్‌ను సంప్రదిస్తే మరింత సమాచారం లభిస్తుంది.
కడప యోగి వేమన యూనివర్శిటీలో డిగ్రీ కోర్సులు
కడప యోగి వేమన యూనివర్శిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సులు ప్రవేశపెట్టారు. జాతీయ విద్యా విధానం-2020లో భాగంగా ఈ ఏడాది నుంచి బీఎస్సీ అనర్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బీకాం కంప్యూటర్స్ కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తుంది. బీకాం కంప్యూటర్స్ కోర్సులో 60 సీట్లు, కెమిస్ట్రీలో 40 సీట్లు, ఫిజిక్స్ లో 30 సీట్లకు ప్రవేశాలు జరుగుతాయి.
COMMENTS