UPI: Lost your phone.. Do you know how to block UPI IDs?
UPI: మీ ఫోన్ పోయిందా.. యూపీఐ ఐడీలను ఎలా బ్లాక్ చేయాలో తెలుసా.?
ఎప్పుడైతే యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాయో. ఆర్థిక లావాదేవీల తీరే మారిపోయింది. ప్రతీ చిన్న అవసరానికి యూపీఐ పేమెంట్స్ చేసే రోజులు వచ్చేశాయ్. భారత్‌లో 2016లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో భారీగా యూపీపై చెల్లింపులు జరుగుతున్నాయి. 2024 మే నెలలో విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత్‌లో యూపీఐ ద్వారా 14.02 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. ఇతర దేశాల్లో కూడా ఈ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇదిలా ఉంటే స్మార్ట్ ఫోన్‌ను ఎక్కడైనా పడిపోయినా.? లేదా ఎవరైనా దొంగలించినా.? యూపీఐ ఐడీలను ఎలా బ్లాక్ చేసుకోవాలో ఎప్పుడైనా ఆలోచించారా.? ఇంతీ యూపీఐ ఐడీలను ఎలా బ్లాక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
గూగూల్ పే ఐడి..
మీరు ఒకవేళ గూగుల్ పేను బ్లాక్ చేయాలనుకుంటే ముందుగా మరో ఫోన్ నుంచి 18004190157కు డయల్ చేయాలి. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడి ఐడీని బ్లాంక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మరీ ఫోన్ నెంబర్‌తో పాటు మరికొన్ని వివరాలను అందించాల్సి ఉంటుంది.
ఫోన్ పే..
ఇక ఫోన్‌పే విషయానికొస్తే.. ఐడీని బ్లాక్ చేయడానికి ముందుగా 02268727374 లేదా 08068727374 నెంబర్‌కు ఇతర ఫోన్‌ను కాల్ చేయాలి. అనంతరం కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడాల్సి ఉంటుంది. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌తో పాటు మరికొన్ని వివరాలు తెలిపితే వారు ఫోన్ పే ఐడీని డీ యాక్టివేట్ చేస్తారు.
పేటీఎమ్..
ఇక పేటీఎమ్ ఐడీ బ్లాక్ విషయానికొస్తే 01204456456 హెల్ప్ లైన్ నెంబర్‌కు కాల్ చేయాలి. అనంతరం మీ ఫోన్ నెంబర్ ద్వారా పేటీఎమ్ నుంచి లాగవుట్ అవ్వొచ్చు. ఆ తర్వాత పేటీఎమ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం 24 X 7 హెల్ప్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత రిపోర్ట్ ఎ ఫ్రాడ్ లేదా మెసేజ్ అస్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో మీ ఫోన్ పోయిన విషయాన్ని తెలియజేస్తే, పేటీఎమ్ ఖాతా తాత్కాలికంగా బ్లాక్ అవుతుంది.
COMMENTS