Eye twitching: Wham.. are you afraid of eye twitching..? The real reason for this is..
Eye twitching: వామ్మో.. కన్ను అదురుతోందని భయపడుతున్నారా..? దీనికి అసలు కారణం ఏమిటంటే..
సాధారణంగా మనలో చాలా మందికి అప్పుడప్పుడు కన్ను అదురుతూ ఉంటుంది. ఇలా కన్ను అదిరితే ఏం జరుగుతుందోనని భయపడుతుంటాం. అదేమైనా ముందు జరగబోయేదానికి సంకేతం కావొచ్చు అని భావిస్తుంటాము. ఇలా కన్ను అదరడం కొన్నిసార్లు మంచిదని అంటారు. మరికొన్నిసార్లు చెడుకు సంకేతంగా భావిస్తారు. కన్ను అదరడం అనేది ఆడవారిలో మగవారిలోనూ వేర్వేరుగా ఉంటుందని చెబుతారు.. ఆడవారికి కుడి కన్ను అదిరితే లేనిపోని సమస్యలు వచ్చిపడతాయని కొందరు నమ్మితే, మగవారికి ఎడమకన్ను అదిరితే మంచిదని, ఆడవారికి కుడికన్ను అదిరితే మంచిదని ఇంకొందరు విశ్వసిస్తారు. ఇంతకీ కన్ను అదిరితే లాభమా..? నష్టమా..? ఏ కన్ను అదిరితే ఎవరికి మంచిదని చాలా మంది సందిగ్ధంలో ఉంటారు. ఏ కన్ను అదిరితే ఎవరికి మంచిదో ఇక్కడ తెలుసుకుందాం..
కన్ను అదరడంలో.. కన్ను నియంత్రణ కోల్పోయి తనంత తాను అదురుతుంది. అలాంటప్పుడు మహిళలకు కుడి కన్ను కొట్టుకుంటే అరిష్టం అని, మగవారికి ఎడమ కన్ను కొట్టుకుంటే దరిద్రం అని భయపడుతుంటారు. ఆడవారికి ఎడమ కన్ను కొట్టుకోవడం అదృష్టంగా భావిస్తారు. ఆడవారికి ఎడమ కన్ను కొట్టుకుంటే ఆమె జీవితం సంతోషంగా ఉంటుందని చెబుతారు. ఊహించని అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు.. ఇక మగవారిలో కుడి కన్ను కొట్టుకుంటే అతని చిరకాల వాంఛ త్వరలో నెరవేరుతుందని అంటారు. తనకు ఇష్టమైన వారిని కలవడం లేదా ఏదైనా అదృష్టం కలిసి రావడం వంటివి చూస్తారని చెబుతారు. అదే పురుషులకు ఎడమ కన్ను కొట్టుకుంటే దురదృష్టంగా నమ్ముతారు. మగవారిలో ఎడమ కన్ను కొట్టుకోవడం వల్ల ఊహించని ఇబ్బందులకు చెబుతున్నారు. కానీ, ఇవేవీ నిజంగా కాదని కేవలం శారీర ఇబ్బందుల వల్లే కన్ను అదరడం జరుగుతుందని శాస్త్రవేత్తలు, పరిశోధకులు చెబుతున్నారు.
కన్ను అదరడానికి చాలా రకాల శాస్త్రీయ కారణాలను చెబుతున్నారు పరిశోధకులు కన్ను అదిరేందుకు కళ్లు పొడిబారడం, కంటిలో అలెర్జీ, నీరసం, ఒత్తిడి, ఆల్కాహాల్ తీసుకోవడం వంటి లాజికల్ కారణాలు అనేకం ఉన్నాయంటున్నారు. మెదడు లేదా నరాల లోపాల వల్ల కన్ను అదురుతుంది. అయితే, ఇది చాలా అరుదైన లక్షణం.
చాలామందిలో అధిక ఒత్తిడి వల్ల కన్ను అదురుతుంది. ఎక్కువ సేపు టీవీ, మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లను చూసినా కళ్లు ఒత్తిడికి గురవ్వుతాయి. కాబట్టి.. మధ్య మధ్యలో మీ కళ్లకు విశ్రాంతిని ఇవ్వడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరికొందరిలో నిద్రలేమి వల్ల కూడా కళ్లు అదురుతాయి. మనిషికి కనీసం 7 నుంచి 9 గంటలు నిద్ర అవసరం. కాబట్టి.. నిద్రను దూరం చేసుకుని కళ్లపై ఒత్తిడి పెంచకండి. ఇది కంటి ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుంది. కాఫీ లేదా చాక్లెట్లు ఎక్కువగా తినేవారిలో కూడా ఈ సమస్య కనిపిస్తోందట. దీనికి నివారణగా కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోకపోవడమే ఉత్తమం అంటున్నారు నిపుణులు. ఒత్తిడి లేకుండా, బాగా నిద్రపోతూ.. కెఫీన్, మద్యానికి దూరంగా ఉండటం ద్వారా కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మీ కన్ను పదే పదే అదురుతుంటే.. మంచిదే అనుకొని నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే..)
COMMENTS