Good income by making dood cups.. Earning without moving house..
Business Idea: దూద్ కప్స్ తయారీతో మంచి ఆదాయం.. ఇల్లు కదలకుండానే సంపాదన..
మారిన ఆర్థిక అవసరలు, పెరిగిన ఖర్చుల నేపథ్యంలో ప్రస్తుతం రెండు చేతులా సంపాదించాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక ఆదాయం సరిపోని పరిస్థితి ఉంది. అదంఉకే చాలా మంది ఇతర ఆదాయల కోసం అన్వేషిస్తున్నారు. ఇందుకోసం వ్యాపారాన్ని ఎంచుకుంటున్నారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు వ్యాపారాన్ని చేస్తూ డబ్బులు ఆర్జిస్తున్నారు.
ఇక గృహిణిలు కూడా ఇంట్లో ఉంటూనే ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇలాంటి వారి కోసం ఎన్నో వ్యాపారాలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం దూద్ కప్స్‌కు భారీగా డిమాండ్ నెలకొంది. చాలా మంది ఇళ్లలో ప్రతీ రోజూ దూప్ కప్స్‌ను ఉపయోగిస్తున్నారు. పూజ గదిలో కచ్చితంగా దూప్ కప్స్ ఉండే పరిస్థితి ఉంది. మరి డిమాండ్ ఉన్న ఈ దూద్ కప్స్ తయారి వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల మంచి ఆదాయం పొందొచ్చు. ఇంతకీ దూప్ కప్స్ తయారీని ఎలా ప్రారంభించాలి.? ఇందులో లాభాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
దూప్ కప్స్ తయారీకి ఒక చిన్న మిషన్‌తో పాటు మూడి సరుకు అవసరపడుతుంది. పొడిలా ఉండే ముడి సరుకును మిషిన్‌లో వేసి నొక్కితే దూప్ కప్స్ తయారవుతాయి. అనంతరం అందులో కప్స్‌లో వేసే దూప్‌ను కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దూప్ కప్స్‌లో వదూప్‌ను వేసిన తర్వాత వాటిని మంచి ప్యాకేజీ చేసి విక్రయించుకోవచ్చు. మీ సొంత బ్రాండింగ్‌తో వీటిని ప్యాక్ చేసి అమ్ముకోవచ్చు. ఈ మిషిన్‌కు ఎలాంటి పవర్ కూడా అవసరం లేదు. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో దూప్ కప్స్ ప్యాకేట్ తక్కువలో తక్కువ రూ. 50గా ఉన్నాయి. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా భారీగా లాభాలు ఆర్జించవచ్చు.
COMMENTS