Business Idea: From Patnam to village.. this business will not go anywhere. Huge income..
Business Idea: పట్నం నుంచి పల్లె వరకు.. ఎక్కడైనా ఈ బిజినెస్‌కు తిరుగే ఉండదు. భారీగా ఆదాయం..
వ్యాపారం చేయాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అయితే పెట్టుబడికి భయపడో, లాభాలు వస్తాయో రావో కారణంతో చాలా మంది ఆ ఆలోచనను విరమించుకుంటారు. గిరాకీ ఉంటుందో, ఉండదో అన్న కారణంతో కూడా అటువైపు చూడరు. అయితే కొన్ని రకాల బిజినెస్‌లకు అసలు నష్టం అనేదే ఉండదు. నిత్యం డిమాండ్ ఉంటుంది. అలాంటి ఓ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చీరాల ఐరెన్ ప్రస్తుతం డ్రెండీ బిజినెస్‌లో ఒకటి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ప్రతీ చోటా శారీ ఐరెన్ చేయించుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీన్ని మీరు బిజినెస్ ఐడియాగా మార్చుకుంటే మీకు తిరుగే ఉండదు. సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడూ డిమాండ్ ఉండే బిజినెస్ ఇది. సాధారణంగా చొక్కాలు, ప్యాంట్స్‌ను చిన్న ఐరన్ మిషన్‌తో చేస్తారు. కానీ చీరలు ఐరెన్ చేయాలంటే పెద్ద మిషిన్స్ అవసరపడతాయి.
శారీ ఐరన్ బిజినెస్‌ను ప్రారంభించాలంటే ఐరన్ మిషన్ ఉండాలి. ఇందులో ఫుల్ ఆటోమెటిక్, సెమీ ఆటోమెటిక్ మిషన్స్ ఉంటాయి. ఒక్క రోజులో సుమారుగా ఈ మిషన్ ద్వారా 150 నుంచి 200 వరకు ఐరన్ చేయొచ్చు. ఒక్కసారి ఐరెన్‌కు తక్కువలో తక్కు రూ. 100 చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు ఒక్క రోజులో 50 చీరలు ఐరెన్ చేసినా రోజుకు రూ. వెయ్యి సంపాదించుకోవచ్చు. ఈ లెక్కన నెలకు రూ. 30 వేల ఆదాయం పొందొచ్చు.
ఇలాంటి బిజినెస్ ఐడియాలకు సంబంధించి యూట్యూబ్‌లో ఎన్నో వీడియోలు ఉన్నాయి. ఈ మిషిన్స్ ఆపరేటింగ్ కూడా చాలా సులభంగా ఉంటుంది. ఈ మిషన్స్ ధర రూ. 2 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఇక ఈ బిజినెస్‌ను ఏర్పాటు చేసుకోవడానికి ఒక చిన్న గది ఉంటే సరిపోతుంది. అలాగే కరెంట్ ఛార్జీలు భరించాల్సి ఉంటుంది. ఇక మీ సంస్థకు సంబంధించి బ్రాండింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
COMMENTS