Good news for those who have ration cards..Sale of goods at low prices..since when
Ap Rythu Bazaars: రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త..తక్కువ ధరలకే సరుకుల విక్రయం..ఎప్పట్నుంచి అంటే.
Ap Rythu Bazaars:ఏపీలో రేషన్ కార్డుఉన్నవారికి గుడ్ న్యూస్. అన్ని రైతు బజార్లలో తక్కువ ధరలకు సరకులను అందించనున్నారు. ప్రభుత్వం తక్కువ ధరకే సరుకులన్ని అందజేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు.
విజయవాడలోని పౌరసరఫరాల శాఖ కమిషనరేట్ లో టోకు వర్తకులు, రైస్ మిల్లర్లు, సరఫరాదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిత్యావసర ధరల పెరుగుదలపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం పంపిణీ చేయడం పై చర్చించారు.
ఈనెల 11 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు బజార్లలోనూ నిర్ణయించిన ధరల ప్రకారమే సరుకులు విక్రయించేందుకు వర్తకులు అంగీకరించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్వహించిన ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ సిద్ధార్థజైన్, ఎండీ వీరపాండియన్ తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. రైతు బజార్లలో విక్రయించే సరుకుల వివరాలను వెల్లడించారు. కందిపప్పు బహిరంగ మార్కెట్లో రూ. 181కి విక్రయిస్తుండగా..రైతు బజార్లలో 160కే విక్రయిస్తారు. స్టీమ్డ్ రైట్ రూ.49, బియ్యం రూ. 48కే విక్రయిస్తారు.
ఇష్టానుసారంగా ధరలు పెంచకుండా కందిపప్పు, బియ్యం ధరల స్థీరికరణకు ఆదేశాలు జారీ చేసింది. కందిపప్పు బహిరంగ మార్కెట్లో కిలో రూ. 181కి, రైతు బజార్లలో రూ. 160కి విక్రయించేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే బియ్యం ధరలు బహిరంగ మార్కెట్లో కిలో రూ. 55.85కి , రైతు బజార్లలో రూ. 48కి అమ్మటానికి అనుమతి ఇచ్చినట్లు టీడీపీ ట్వీట్ చేసింది.
Post a Comment