AP High Court Jobs : Law Clerk Posts in AP High Court - Notification Releases, Details
AP High Court Jobs : ఏపీ హైకోర్టులో లా క్లర్క్ పోస్టులు - నోటిఫికేషన్ విడుదల, వివరాలివే
AP High Court Jobs 2024: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కాంట్రాక్ట్ ప్రాతిపదికన లా క్లర్క్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయింది. లా క్లర్క్ పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు హైకోర్టు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. దరఖాస్తు దాఖలకు ఆగస్టు 6 వరకు గడువు ఉంది. దరఖాస్తును ఆఫ్‌లైన్‌లోనే దాఖలు చేయాల్సి ఉంటుంది.
హైకోర్టు న్యాయమూర్తులకు సహాయం చేయడానికి లా క్లర్క్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. లా క్లర్క్ పోస్టులు మొత్తం 12 ఉన్నాయి. నెలకు వేతనం రూ.35 వేలు ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు దాఖలు చేసేందుకు అర్హత గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి న్యాయ శాస్త్రంలో పట్టబధ్రుడై ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతోపాటు ఏ రాష్ట్ర హైకోర్టు బార్ కౌన్సిల్‌లోనూ అడ్వకేట్‌గా నమోదు అయి ఉండకూడదు. వయో పరిమితి జనవరి 1 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
విద్యార్హత, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. దరఖాస్తును ఆఫ్‌లైన్‌లోనే చేయాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్ (రిక్రూట్‌మెంట్), ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అమరావతి, నేలపాడు, గుంటూరు జిల్లా, ఏపి-522239 అడ్రస్‌కు పంపాలి.
అప్లికేషన్‌తో పాటు వయస్సుకు సంబంధించిన సర్టిఫికేట్, విద్యాఅర్హత సర్టిఫికేట్లు అటిస్టెడ్ కాపీలను జత చేసి పంపాలి. పోస్టల్ కవర్‌పై అప్లికేషన్ ఫర్ ది పోస్టు ఆఫ్ లా క్లర్క్స్ అని రాయాలి. ఆప్లికేషన్ ఆగస్టు 6 తేదీ సాయంత్రం 5 గంటలలోపు అడ్రస్‌కు చేరాలి.
ఏపీ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://aphc.gov.in/docs/23.07.2024.lawclerk.pdf కిక్ చేస్తే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తి చేసి, దానికి సర్టిఫికేట్లు జత చేసి పంపాలి.
COMMENTS